ePaper
Wednesday, August 26, 2026
ePaper
Homeతెలంగాణపెద్దపల్లిజి.యం. కార్యాలయంలో ఏరియా స్థాయి నిర్మాణాత్మక సమావేశం కమాన్ పూర్

జి.యం. కార్యాలయంలో ఏరియా స్థాయి నిర్మాణాత్మక సమావేశం కమాన్ పూర్

📰 Generate e-Paper Clip

కమాన్ పూర్,అర్జున్ సమాచారం:

రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలో ప్రాతినిధ్య సంఘం అయినటువంటి సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్టియుసి) ప్రతినిధులతో బుధవారం  జి.యం. కార్యాలయంలో ఏరియా స్థాయి నిర్మాణాత్మక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా ఏరియాకు సంబంధించిన పలు అంశాలపై  రామగుండం-3 ఏరియా  జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు లతో ప్రాతినిధ్య సంఘం ఏరియా ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి, ఇతర సభ్యులు చర్చించారు. ఈ సమావేశంలో సింగరేణి సంస్థలో అమలులో ఉన్న ఎల్ 1, ఎల్ 2, విధానం కారణంగా ఓ.బి, అండర్ గ్రౌండ్ సివిల్ పనులలో, పరికరాల పని ముట్లలో నాణ్యత లోపాలు కనిపిస్తున్నాయని, ప్రస్తుత ఎల్ 1, ఎల్ 2, పూర్తిగా పునః సమీక్షించి, నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా అమలు చేయడం, సింగరేణి వ్యాప్తంగా ఒకరి క్వార్టర్ లో మరొకరు ఉంటున్నారని అన్ని క్వార్టర్లను క్రమబద్రికరించి ఎవరైతే క్వార్టర్లో ఉంటున్నారో వారికి పర్మనెంట్ చేయడం, ఐ ఈ డి లెక్కల ప్రకారం అడ్జలా లాంగ్వాల్ గనిలో అదనంగా ఉన్న ఎలక్ట్రిషన్, ఫిట్టర్ లను, ఘనంగా ఉన్న సిబ్బందిని అవసరానికి అనుగుణంగా ఓ సి పి 1, ఓసిపి-2 లకు బదిలీ చేయడం, సెంటినరీ కాలనీలో గల క్వార్టర్స్ నిర్మించి చాలా కాలం అవుతున్న కారణంగా తరచూ మరమ్మత్తులు అవుతున్నాయి కాబట్టి సివిల్ విభాగం కు తగినంత మాన్ పవర్ ను ఇచ్చి క్వార్టర్ల మరమ్మత్తులను సకాలంలో చేపట్టేలా చర్యలను తీసుకోవడం, ఓసిపి-1 ఎస్ అండ్ డి విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ద్విచక్ర వాహన పార్కింగ్ కోసం షెడ్డు ను నిర్మించడం, ఆర్ జి త్రీ, ఏపీఏ ఏరియాలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు అర్జీ -2 ఏరియా లోనీ ఉద్యోగులతో సమానంగా క్వార్టర్స్ కౌన్సిలింగ్ లో అవకాశం కల్పించడం, ఇష్టం లేని పదోన్నతి వద్దని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని పదోన్నతి రద్దుచేసి వారిని యధా ప్రకారం వారి డెసిగ్నేషన్ లలో కొనసాగించడం, ఓసిపి-1 ఉత్పత్తి, రోజువారి కార్యకలా పాలకు అవసరమైన స్థాయిలో డోజర్ లను అందుబాటులో ఉంచడం, వర్షపు నీరు నిలవడం వల్ల సిహెచ్పీ కాంట గేట్ ప్రాజెక్ట్ ఆఫీస్ గేటు వరకు గల రహదారి, కాంపౌండ్ ఫెన్సింగ్ వెంబడి ఉన్న సైడ్ డ్రెయిన్ క్లియర్ చేయడం, వర్షపు నీరు సక్రమంగా వెళ్లి పోయేలా చర్యలు తీసుకోవడం, సెంటినరీ కాలనీలో కోతులు, వీధి కుక్కలు, పందుల బెడద విపరీతంగా పెరిగిందని కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటి నియంత్రణకు తక్షణ, శాశ్వత చర్యలు తీసుకోవడం, లాంటి అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా జిఎంలు  మాట్లాడుతూ ఏరియా పరిధిలో ఉన్న సమస్యలను సంబంధిత అధికారుల ద్వారా వివరాలను సేకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. అదేవిధంగా కార్పోరేట్ కార్యాలయ పరిధిలో ఉన్న సమస్యలను సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
ఈ సమావేశంలో స్ట్రక్చరల్ కమిటీ సభ్యులు జి.తిరుపతి, కె.సాయికృష్ణ, ఎన్.శ్రీనివాస రావు, ఎస్వో టుజియం యం.రామ్మోహన్, ఏరియా ఇంజినీర్ ఎ.ఉదయ భాస్కర్, ప్రాజెక్ట్ ఆఫీసర్లు కె.జనార్ధన్, జి.శంకర్, ఐ ఇ డిజిఎం బి.టి. మురళీకృష్ణ, సివిల్ డిజియం రాజేంద్ర కుమార్, పర్సనల్ విభాగాధిపతి బి.సుదర్శనం, ప్రాజెక్ట్ ఇంజినీర్ ప్రకాష్, సిహెచ్పి డిజియం జి.శ్రీనివాస్, ఐ టి డిప్యూటీ మేనేజర్ ఆర్.రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
=========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!