కమాన్ పూర్,అర్జున్ సమాచారం:
నిర్దేశించిన సమయంలో 4వ ప్యానెల్ లాంగ్ వాల్ పనులను పూర్తి చేయని డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వి.సూర్య నారాయణ అన్నారు.
వారు గురువారం అడ్రియాల లాంగ్ వాల్ గనిని సందర్శించారు.అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు నిర్దేశించిన సమయంలో లాంగ్ వాల్ పనులను పూర్తి చేయడానికి తీసుకొంటున్న చర్యలను వివరించారు. అనంతరం డైరెక్టర్ ఆపరేషన్స్ మాట్లాడుతూ లాంగ్వాల్ 3వ ప్యానెల్ సాల్వేజింగ్ పనుల పూర్తి చేసినందుకు గాను అందులో భాగస్వాములు అయిన వారికి అభినందనలు తెలిపారు. 4వ ప్యానెల్ తయారీ పనుల పై చర్చించి, భద్రత పై పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. భద్రత తో నిర్దేశించిన సమయంలో 4వ ప్యానెల్ పనులను పూర్తిచేసి, లాంగ్ వాల్ నుండి భద్రతతో కూడిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని అందుకు తగిన చర్యలు చేపట్టాలని పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.
వారితో పాటు రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, ఏరియా ప్రాజెక్ట్ ఇంజినీర్ టి.రఘురాం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
=========================
అడ్రియాల లాంగ్ వాల్ గనిని సందర్శించిన డైరెక్టర్ ఆపరేషన్స్
RELATED ARTICLES

