రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం,కమాన్ పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు.
కమాన్ పూర్: అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 17.
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కమాన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు. అన్నారు శనివారం కమాన్ పూర్ మండలం గుండారం రిజర్వాయర్ నుండి ఆర్ ఎస్ బి ద్వారా ముత్తారం రామగిరి మండలాలకు సాగునీరును విడుదల చేశారు. ఈ సందర్భంగా వైనాల రాజు మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి రైతాంగ సంక్షేమం కోరి సాగునీరు ఎస్సారెస్పీ ద్వారా విడుదల చేయించడం జరిగిందని దీంతో గుండారం రిజర్వాయర్ లోకి నింపి అనంతరం ముత్తారం రామగిరి కమాన్ పూర్ మండలంలోని రైతులకు అందేలా సాగునీరు విడుదల చేయడం జరిగిందని అన్నారు. మంత్రి ప్రత్యేక చొరవతో రైతులకు మేలు జరిగిందని పేర్కొన్నారు .రైతుల పంటలకు నష్టం వాటిల్లకుండా ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రితో పాటు, ఉత్తంకుమార్ రెడ్డి తో మాట్లాడి ఈ నీరును విడుదల చేసి రైతులను ఆదుకోవడం జరిగిందని అన్నారు. రైతుల పక్షాన ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ అన్వర్, సర్పంచులు రంగు సత్యనారాయణ గౌడ్, జంగిలి పోచాలు, గుండారం ఉపసర్పంచ్ అంబీరు రాజేందర్, గుండారం మాజీ సర్పంచులు ఆకుల ఓదెలు, అడువాల చంద్రయ్య, పిడుగు నరసయ్య, గుండారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిడుగు శంకర్, వార్డు సభ్యుడు దామర దేవయ్య,నాయకులు ఆరెల్లి కొమురయ్య గౌడ్, ఆర్ష ఎల్లయ్య, ముకుంద శ్రవణ్, తీగల సమ్మయ్య, ముధం కొమురయ్య, మెరుగు కుమార్, బర్ల శ్రీకాంత్, గొల్లపల్లి రాయమల్లు, వడ్లకొండ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

