ePaper
Saturday, August 29, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్యాలపై పోరుబాటకు...

బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్యాలపై పోరుబాటకు కేటీఆర్ పిలుపు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
అవినీతిని ఎండగట్టాలి పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
వారం రోజుల ప్రత్యేక నిరసన కార్యక్రమాలపై పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్,
ఒకటవ తేదీన తెలంగాణ భవన్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్‌తో ప్రజల్లోకి బీఆర్‌ఎస్.
రెండవ తేదీ నుంచి వరుసగా కార్యక్రమాలు..
సెప్టెంబర్ 2
ఆరు గ్యారెంటీల వైఫల్యంపై నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు
420 హామీల మోసాన్ని గుర్తుచేస్తూ భారీ ఫ్లెక్సీల ప్రదర్శన
ప్రజలకు బాకీ ఉన్న హామీలతో ఇంటింటికీ బాకీ కార్డుల పంపిణీ:
సెప్టెంబర్ 3
వ్యవసాయ విధ్వంసంపై అన్ని నియోజకవర్గాల్లో రైతు సదస్సులు
సాగునీరు, విద్యుత్, యూరియా, బీమా సమస్యలపై రైతులతో సమావేశాలు
హైదరాబాద్‌లో 22ఏ నిషేధిత జాబితా భూముల సమస్యపై నిరసనలు,
సెప్టెంబర్ 4
మహిళలు, వికలాంగులతో ప్రత్యేక సదస్సులు
మహిళలకు ఇచ్చిన హామీల అమలు వైఫల్యంపై నిరసన కార్యక్రమాలు
రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అంశాలపై నిలదీత
హామీలు అమలు చేయని ప్రభుత్వానికి నిరసనగా వంటావార్పు
సెప్టెంబర్ 5
విద్యార్థులు, యువతతో నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు.. ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్‌పై పోరాటం
అదిలాబాద్, సింగరేణి ప్రాంతాల్లో ప్రత్యేక నిరసన సదస్సులు
సెప్టెంబర్ 6
హైదరాబాద్‌లో నగర సమస్యలపై ఆటోలతో భారీ ర్యాలీ
తాగునీరు, వీధిదీపాలు, ట్రాఫిక్, శాంతిభద్రతలపై ప్రభుత్వాన్ని నిలదీత
గ్రామాల్లో పారిశుద్ధ్యం, పల్లెల సమస్యలపై నిరసన కార్యక్రమాలు
సెప్టెంబర్ 7
ప్రజావాణి కేంద్రాల్లో కాంగ్రెస్ హామీల వైఫల్యంపై వినతిపత్రాలు
420 హామీల మోసంపై జిల్లా, మండల కేంద్రాల్లో ప్రభుత్వానికి ఫిర్యాదులు
సెప్టెంబర్ 8
వారం రోజుల పోరాట కార్యక్రమాలపై అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రెస్‌మీట్లు
అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు
సెప్టెంబర్ 10 ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నిరసనలకు బీఆర్‌ఎస్ సంఘీభావం.
కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల అసమర్థ పాలన, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం, అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు భారత రాష్ట్ర సమితి చేపట్టనున్న వారం రోజుల ప్రత్యేక కార్యాచరణను విజయవంతం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2 నుంచి వరుసగా ఏడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచాలని ఆయన సూచించారు.
ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వారం రోజులపాటు చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారికి సమగ్రంగా దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులు దాటినా ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ వైఖరిని ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ ప్రజల ముందు ఎండగట్టాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.
==============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!