కమాన్ పూర్,అర్జున్ సమాచారం:
అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ కమాన్ పూర్ మండలంలో శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు. కమాన్ పూర్ మండల కేంద్రంతో పాటు గుండారం జూలపల్లి పేరా పల్లి రొంపి కుంట నాగారం పెంచికలపేట సిద్దిపల్లె తదితర గ్రామాల్లో రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. దూరప్రాంతాల నుండి వచ్చి ఆయా గ్రామాల్లోని తమ సోదరులకు రాఖీలు కట్టారు. దీంతో సోదరులు తమ చెల్లెలకు అక్కలకు దక్షిణ సమర్పించారు. దీంతోపాటు గ్రామాల్లో రాఖీ పండుగ సందడి నెలకొంది. అలాగే తమ తమ బంధువుల సోదరుల గ్రామానికి వెళ్లేందుకు బస్సులు కిటకిటలాడాయి. ఈ వేడుకల్లో తహసిల్దార్ ముస్త్యాల వాసంతి, ఎంపీడి ఓ ప్రియాంక, ఎంపీ ఓ సౌమ్య, గిదవార్ స్రవంతి, సర్పంచులు పల్లె మాధవి నారాయణ, బంగారు కళ్యాణి మహేష్, పోల్ దాసరి వనిత సాయికుమార్, తదితరులు తమ సోదరులకు రాఖీలు కట్టారు.
=====================

