TGEJAC మంచిర్యాల జిల్లా చైర్మన్ శ్రీ గడియారం శ్రీహరి గారి ఆధ్వర్యంలో
అర్జున్ సమాచారం మంచిర్యాల ప్రతినిధి సెప్టెంబర్ 2.
ఆర్డీవో ఆఫీసులో నిరంతరాయంగా కొనసాగుతున్న నిరసన. TGEJAC రాష్ట్ర చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ శ్రీ ఏలూరి శ్రీనివాస్ రావు గారి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమము లలో భాగంగా RDO కార్యాలయం మంచిర్యాల ఉద్యోగులు అందరూ TGEJAC మంచిర్యాల జిల్లా చైర్మన్ శ్రీ గడియారం శ్రీహరి గారి ఆధ్వర్యంలో నిరంతరాయంగా 7 రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడం జరిగినది. TGEJAC మంచిర్యాల జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి గారు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలు అయిన PRC వెంటనే అమలుచేయాలని CPS రద్దు చేసి OPS ను అమలు చేయడం, 6 పెండింగ్ DA లు ఇవ్వడం, NEHS ను సమర్థవంతంగా అమలు చేయడం, మరియు 12 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని,మరియు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు 17% HRA ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంచిర్యాల జిల్లాలోని ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు అందరూ సెప్టెంబర్ 10 తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని తెలుపడం జరిగినది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించడం జరిగినది. ఈ నిరసన కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయం పరిపాలన అధికారి కే రమేష్, ఉద్యోగులు రవి కిషోర్, సతీష్ ,పద్మశ్రీ, వెంకటేష్ ,మల్లేష్, జనార్దన్, జీనత్, షారుక్, మహేందర్, అరుణ, అవినాష్ తదితరులు పాల్గొన్నారు..

