కమాన్ పూర్,అర్జున్ సమాచారం:
సింగరేణి సంస్థలో పనిచేస్తూ
బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్ అన్నారు.
సింగరేణి రామగుండం-3 ఏరియాలో విధులు నిర్వహిస్తున్న వి.పి.వర్గీస్ సెక్యూరిటీ సర్వీస్ కంపెనీకి చెందిన 120 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి బుధవారం సెక్యూరిటీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్ పాల్గొని ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి ఐడెంటిటీ కార్డులు, హాస్పిటల్ బుక్స్ ను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది సంస్థ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నారని, తమ విధులను అప్రమత్తతతో, బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ, సంస్థ ఆస్తులను కాపాడాలని, అనుక్షణం అప్రమత్తతతో విధులు నిర్వహించాలని సూచించారు.
ఐడెంటిటీ కార్డుల ద్వారా సిబ్బందికి అధికారిక గుర్తింపు లభించడం, హాస్పిటల్ బుక్స్ ద్వారా వైద్య సేవలను వినియోగించుకునే అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి ఎం. రామచంద్రారెడ్డి, ఎస్వోటు జిఎం యం.రామ్మోహన్, పర్సనల్ విభాగాధిపతి బి.సుదర్శనం, ఏరియా సెక్యూరిటీ అధికారి షబ్బీరుద్ధీన్, డివై పి ఎం ఎన్. వంశీధర్, సీనియర్ ఇన్స్పెక్టర్ పోగుల స్వామి, వి పి వర్గీస్ కాంట్రాక్టర్ శ్రీనివాసరావు, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల పిట్ కార్యదర్శులు శ్రీనివాసరాజు, గోపతిరమేష్, కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు మబ్బు శంకర్, బి. కిరణ్ రెడ్డి, ఆకుల వెంకన్న తో పాటు ఇతర అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.
========================
బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి ఆర్జీ త్రీ జియం ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి ఐడెంటిటీ కార్డులు, హాస్పిటల్ బుక్స్ అందజేత
RELATED ARTICLES

