ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeతెలంగాణపెద్దపల్లిమహానేత వైఎస్సార్‌కు ఘన నివాళి.. ప్రతి గుండెలో ఆయనో దేవుడు!* - *రామగిరిలో ఘనంగా...

మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళి.. ప్రతి గుండెలో ఆయనో దేవుడు!* – *రామగిరిలో ఘనంగా డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి వేడుకలు* – *ఆరోగ్యశ్రీ, 108 సేవల ద్వారా వైఎస్సార్ చిరంజీవిగా మిగిలారు* – *సిరిసిల్ల పాదయాత్రలో ఆయనతో నడవడం నా అదృష్టం: తొట్ల తిరుపతి యాదవ్* – *మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వాన్ని మరింత బలోపేతం చేద్దాం*

📰 Generate e-Paper Clip

పెద్దపల్లి, అర్జున్ సమాచార్, సెప్టెంబర్ 02: 
– *ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయనను ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ కొనియాడారు.*
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు,బుధవారం వైఎస్సార్ 17వ వర్ధంతిని పురస్కరించుకుని రామగిరి మండలం బేగంపేట్ ఎక్స్ రోడ్‌లోని మంథని బ్లాక్ కాంగ్రెస్ కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.*మండల కాంగ్రెస్ అధ్యక్షులు రొడ్డ బాపన్న పటేల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన తిరుపతి యాదవ్.. పార్టీ శ్రేణులతో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ‘వైఎస్సార్ అమర్ రహే’ అంటూ నినాదాలు చేశారు.*
పాదయాత్రను గుర్తుచేసుకుంటూ ఉద్వేగం.* *ఈ సందర్భంగా తొట్ల తిరుపతి యాదవ్ మాట్లాడుతూ…ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్సార్ చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రను గుర్తుచేసుకున్నారు.* *సిరిసిల్ల ప్రాంతంలో సాగిన ఆ పాదయాత్రలో తాను, అలాగే ప్రస్తుత రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సైతం పాల్గొనడం గర్వకారణమన్నారు. ఆనాడు వైఎస్సార్ అహర్నిశలు శ్రమించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన తీరును ఆయన శ్రేణులకు వివరించారు.*
కూయ్.. కూయ్.. మంటూ ప్రాణాలు కాపాడే 108 అంబులెన్స్, పేదల పాలిట సంజీవని అయిన ఆరోగ్యశ్రీ పథకాలు వైఎస్సార్ మానస పుత్రికలు. ఆ పథకాలే ఆయన్ను ప్రజల పాలిట దేవుడిగా నిలబెట్టాయి.ఆయన అకాల మరణం రాష్ట్ర ప్రజలందరినీ కంటతడి పెట్టించింది.*ప్రతి ఇంటా ఆయన ఫోటో పెట్టుకుని రోదించిన దృశ్యాలు మనం చూశాం”అని ఉద్వేగభరితంగా ప్రసంగించారు.*
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే.. ఏకతాటిపై నడుద్దాం!*
వైఎస్సార్ మరణానంతరం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం ప్రతి కార్యకర్త గర్వకారణంగా భావించాలన్నారు.* *రాబోయే రోజుల్లో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వాన్ని మరింత బలపరుస్తూ, కాంగ్రెస్ శ్రేణులంతా ఏకతాటిపై ఉండి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.*
ఈ కార్యక్రమంలో కమాన్‌పూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్.ఎస్. అన్వర్, రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు బండారి సదానందం, ఎస్సీ సెల్ అధ్యక్షులు కండె పోషం,మాజీ ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్, ఆదివారం పేట సర్పంచ్ ఇల్లందుల సంజీవ్,నవాబ్‌పేట సర్పంచ్ రొడ్డ మౌనిక కుమార్, పుల్లెల వీరగోని రమాదేవి శ్రీనివాస్, సర్పంచ్ కొండవేన దివ్య సుధాకర్, మాజీ సర్పంచ్ తీగల సమ్మయ్య, ఎరుకల ఓదెలు, మాజీ సర్పంచ్ దేవునూరి రజిత శ్రీనివాస్, కెక్కర్ల శ్రీనివాస్,ఉట్ల గోపాల్ రెడ్డి, కాలేశ్వరం దేవస్థానం డైరెక్టర్ కాటం సత్యం,రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు మోత్కూరి అవినాష్ గౌడ్,మాజీ ఉప సర్పంచ్ మొగిలి నరేష్ యాదవ్,అట్టి తిరుపతిరెడ్డి, వేముల కనుకయ్య, మాజీ ఎంపీటీసీ కన్నూరి నర్సింగరావు, గ్రామ శాఖ అధ్యక్షులు తోగరి చంద్రయ్య, మైదం బుచ్చయ్య,INTUC నాయకులు తాటికొండ మొగిలి, శంకేసి రాజమల్లు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు జాగరి రజిత, మొగిలి రేణుక, కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్లపల్లి రాజమల్లు,కొడారి సాది, గాజుల భూమయ్య, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు కొండవేన ప్రభాకర్, ఆరెల్లి మహేందర్, భోగే ప్రకాష్, ఇరుగురాళ్ల రమేష్,బంక్ మల్లేష్, ఆర్ల సాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!