దేశవ్యాప్తంగా ఒక లక్ష ఛార్జింగ్ పాయింట్లు..
ముంబై, సెప్టెంబర్ 3, (అర్జున్ సమాచారం సెప్టెంబర్ )
టాటా మోటార్స్ & జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ వంటి కంపెనీలు ఇప్పటికే చిన్న ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్నాయి. అయితే, దేశంలో అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ అయిన మారుతి సుజుకి మాత్రం ఈ విషయంలో ఇంకా వెనుకబడి ఉంది. అయితే.. దేశంలో తగినంత ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్న ఈవీలను తీసుకురావాలని ఈ కంపెనీ భావిస్తోంది. కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో మేనేజింగ్ డైరెక్టర్ హిసాషి టకేయుచి ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్‌లో EV ఛార్జింగ్ సదుపాయాలు సిద్ధమైన వెంటనే తమ పోర్ట్‌ఫోలియోలో చిన్న ఎలక్ట్రిక్ కార్లను చేరుస్తామని ఆయన చెప్పారు.ప్రస్తుతం మారుతి సుజుకి నుంచి భారత్‌లో ఒకే ఒక అందుబాటులో ఉంది. అది ఈ విటారా. అయితే భవిష్యత్తులో చిన్న ఎలక్ట్రిక్ కార్లను కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. దీనికి ముందుగా దేశవ్యాప్తంగా ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలని కంపెనీ నిర్ణయించింది.మారుతి సుజుకి ఇప్పటికే 13 ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా 1,100కు పైగా నగరాల్లో 2,000కు పైగా ప్రత్యేక ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. హైవేలు & ఎక్స్‌ప్రెస్‌వేలపై కూడా ఛార్జింగ్ సదుపాయాలను పెంచేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. దేశంలోని టాప్ 100 నగరాల్లో ముఖ్యమైన ప్రాంతాల్లో ఛార్జర్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేసింది. ఒక్కో ఛార్జింగ్ పాయింట్ మధ్య సుమారు 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉండేలా నెట్‌వర్క్‌ను విస్తరించనుంది.మారుతి సుజుకి దీర్ఘకాలికంగా భారీ లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ దశాబ్దం (2030) ముగిసే నాటికి దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. చిన్న ఈవీలను తీసుకురావడానికి ఈ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ కీలకంగా మారనుంది. ప్రస్తుతం ఛార్జింగ్ సదుపాయాలు ప్రధాన నగరాల్లో మాత్రమే, అవి కూడా పరిమితంగా ఉన్నాయి. చిన్న ఎలక్ట్రిక్ కార్లను సామాన్య వినియోగదారులకు చేరువ చేయాలంటే విస్తృతమైన ఛార్జింగ్ నెట్వర్క్ అవసరమని మారుతి భావిస్తోంది.మారుతి సుజుకి కేవలం EVలపైనే దృష్టి పెట్టడం లేదు. పెట్రోల్ ఇంజిన్ వాహనాలు, హైబ్రిడ్ కార్లు & వాహనాలపై కూడా పెట్టుబడులు కొనసాగించనుంది. ICE వాహనాలు తమ వ్యాపారంలో కీలకంగా కొనసాగుతాయని హిసాషి టకేయుచి తెలిపారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ కూడా భవిష్యత్తులో ఈ వాహనాలకు డిమాండ్ కొనసాగేందుకు సహాయపడుతుందని కంపెనీ భావిస్తోంది.మారుతి కొత్త తయారీ ప్లాంట్లను కూడా విభిన్నంగా రూపొందిస్తోంది. ఒకే ప్రొడక్షన్ లైన్‌పై , హైబ్రిడ్ వాహనాలు, సీఎన్జీ కార్లు & వాహనాలను తయారు చేసే విధంగా ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. దీంతో మార్కెట్లో ఏ రకం వాహనాలకు డిమాండ్ పెరిగితే ఆ దిశగా ఉత్పత్తిని వేగంగా మార్చుకోవచ్చు. మొత్తంగా చూస్తే.. చిన్న విషయంలో మారుతి తొందరపడటం లేదు. ముందుగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి, ఆ తర్వాత చిన్న ఎలక్ట్రిక్ కార్లను భారత మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ వ్యూహంగా కనిపిస్తోంది.

