ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeతెలంగాణమంథని ముత్తారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా దొడ్డ బాలాజీ

మంథని ముత్తారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా దొడ్డ బాలాజీ

📰 Generate e-Paper Clip

మంథని ముత్తారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా దొడ్డ బాలాజీ

అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 3.

ముత్తారం: మంథని నియోజకవర్గ పరిధిలోని ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా దొడ్డ బాలాజీ నియమితులయ్యారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న దొడ్డ బాలాజీకి మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

దొడ్డ బాలాజీ నియామకం పట్ల మండలంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన అధ్యక్షుడి నాయకత్వంలో ముత్తారం మండలంలో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు.

మండల అధ్యక్షుడిగా తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ పెద్దలకు దొడ్డ బాలాజీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ, కార్యకర్తలను సమన్వయం చేసుకుని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!