ePaper
Friday, September 11, 2026
ePaper
Homeతెలంగాణఎమ్మెల్సీ తాత మదు ను వెంటనే సస్పెండ్ చేయాలి,

ఎమ్మెల్సీ తాత మదు ను వెంటనే సస్పెండ్ చేయాలి,

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్సీ తాత మదు ను వెంటనే సస్పెండ్ చేయాలి,

జన్నారం ప్రతినిధి :అర్జున్ సమాచారం సెప్టెంబర్ 8:

జన్నారం : అసెంబ్లీ స్పీకర్ పై సమాజం తలదించుకునేలా వాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాత మధును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ గారి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా రాస్తారోకో చేయడం జరిగింది.

ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందు నాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అంటేనే దళిత వ్యతిరేక పార్టీ అని అన్నారు. దళితులు ఉన్నత పదవుల్లో ఉంటే దొరల కండ్లు మండుతున్నాయన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని ఉద్దేశించి ఎమ్మెల్సీ తాత మధు చేసిన వాఖ్యలు తెలంగాణ సమాజానికి సిగ్గు చేటన్నరు

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మంద రాజేష్, ప్రధాన కార్యదర్శి మేకల మాణిక్యం, AMC చైర్మన్ దుర్గం లక్ష్మీ నారాయణ, పొనకల్ సర్పంచ్ జక్కు సుష్మ-భూమేష్, AMC వైఎస్ చైర్మన్ ఫాసిఉల్లా, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముజాఫర్, SC సెల్ అధ్యక్షులు మామిడిపెళ్లి ఇంద్రయ్య, MPTC ల ఫోరం జిల్లా అధ్యక్షులు MD రియజోద్దీన్, సర్పంచ్ లు ఫోరం అధ్యక్షులు కుదిరే వెంకన్న, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి హేమంత్ చారి, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు గొర్రె మహేష్ యాధవ్,సీనియర్ నాయకులు ముత్యం సతీష్, దూమల్ల రమేష్, మచ్చ శంకరయ్య,సుధాకర్, నందు నాయక్, అబ్దుల్ ముజ్జు ,దూమల్ల ప్రవీణ్, గంగన్న, పాదం రాకేష్, పాపా గౌడ్,
సోషల్ మీడియా నాయకులు షాకిర్, రాహుల్, సర్పంచ్ లు, వర్డ్ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!