ePaper
Thursday, September 10, 2026
ePaper
Homeతెలంగాణముత్తారం వార్డు మెంబర్స్ ఫోరం నూతన కమిటీకి కాంగ్రెస్ ఘన సన్మానం

ముత్తారం వార్డు మెంబర్స్ ఫోరం నూతన కమిటీకి కాంగ్రెస్ ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

ముత్తారం వార్డు మెంబర్స్ ఫోరం నూతన కమిటీకి కాంగ్రెస్ ఘన సన్మానం

అర్జున్ సమాచారం సెప్టెంబర్ 10. ముత్తారం, రిపోర్టర్

ముత్తారం మండల వార్డు మెంబర్స్ ఫోరం నూతన కమిటీగా ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షుడు కుక్కల చంద్రమౌళి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్యాల లక్ష్మి దేవేందర్‌లను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్స్ ఫోరం నాయకులకు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా చొప్పరి సదానందం మాట్లాడుతూ గ్రామ స్వరాజ్య స్థాపనలో, స్థానిక సంస్థలను బలోపేతం చేయడంలో వార్డు సభ్యుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. వార్డు సభ్యుల హక్కులు, విధుల పరిరక్షణకు ఫోరం దిక్సూచిగా పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో నూతన కమిటీ ముందుండాలని ఆకాంక్షించారు.

నూతన అధ్యక్షుడు కుక్కల చంద్రమౌళి మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వార్డు సభ్యులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని వార్డు సభ్యులందరినీ సమన్వయం చేసుకుంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ముత్తారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కోల విజయ్ గౌడ్, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, మాజీ సర్పంచులు తూటి రజిత రఫీ, రాపెల్లి రామన్న, తాటిపాముల వాకులారాణి శంకర్, మాజీ ఉపసర్పంచ్ కలవేన శ్రీనివాస్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు అనుము సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కే.వి.చారి, నూనేటి కృష్ణ, అనుము గోపాల్, అమ్ము రవి, వేల్మరెడ్డి సంజీవరెడ్డి, రాపెల్లి సురేందర్, గుడి రాములు, కలవేన గరుడాచలం, మూడేడ్డ మధుకర్, అలుగం రాజేశం, గడ్డం విద్యాసాగర్, అలుగం పాపయ్య, ఆకుల చిన్ను, కుక్కల శ్రీకాంత్, తాడవేన సంతు, ముదురుకొల్ల నగేష్, గుడికందుల కుమార్, చల్లా సదయ్య, చల్ల కుమార్, మీన్నపురం మల్లేష్, సట్ల శ్రీనివాస్, సట్ల శంకర్, తుండ్ల కొమురయ్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!