ePaper
Friday, September 11, 2026
ePaper
Homeతెలంగాణదళితులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి చావు డప్పు కొట్టుడేదళిత సేన డివిజన్ అధ్యక్షుడు ఊట్ల...

దళితులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి చావు డప్పు కొట్టుడేదళిత సేన డివిజన్ అధ్యక్షుడు ఊట్ల శ్రీనివాస్

📰 Generate e-Paper Clip

దళితులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి చావు డప్పు కొట్టుడేదళిత సేన డివిజన్ అధ్యక్షుడు ఊట్ల శ్రీనివాస్

అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 10 | ముత్తారం రిపోర్టర్

దళితులకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను మోసం చేస్తోందని మంథని డివిజన్ దళిత సేన అధ్యక్షుడు ఊట్ల శ్రీనివాస్ ఆరోపించారు.

దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర దళిత సేన క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు గద్దల శంకర్‌తో కలిసి గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఊట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420.అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అయితే హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు.

దళితుల అభ్యున్నతి కోసం, సమాజంలో వారు సమానంగా జీవించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి అర్హులైన దళితులకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించిందని పేర్కొన్నారు. దళితుల సంక్షేమానికి సంబంధించిన పథకాలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.

కాంగ్రెస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఊట్ల శ్రీనివాస్ విమర్శించారు. దళితులకు రూ.12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒక్క దళిత కుటుంబానికీ ఆర్థిక సాయం అందించలేదని ఆరోపించారు.

ఎన్నికల హామీలను అమలు చేయకపోతే రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దళితుల సమస్యల పరిష్కారం కోసం దళిత సేన నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో దళిత సేన నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!