బాధిత కుటుంబాలను పరామర్శించిన చొప్పరి సదానందం.
అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 10 | ముత్తారం రిపోర్టర్
ముత్తారం మండలం పోతారం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, ఇటీవల మృతి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకుల కుటుంబాలను పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం గురువారం పరామర్శించారు.
పోతారం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కోటగిరి శ్రీశైలం ఇటీవల హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చొప్పరి సదానందం ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతూ, తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
అనంతరం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మేకల ఓదెలు సోదరుడు మేకల బొంద్యాలు, కట్ల మల్లయ్య ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాలను పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెల్కల జితేందర్ యాదవ్, మాజీ ఎంపీటీసీ బండ సమ్మయ్య, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నెత్తెట్ల కిరణ్, కాంగ్రెస్ నాయకులు చెల్కల ఓదెలు, బత్తుల మల్లేశం, చల్ల సంతోష్, గుజ్జేటి వెంకటేశ్వర్లు, బత్తుల సతీష్, కట్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

