అర్జున్ సమాచారం:
ఖైరతాబాద్ మహాగణపతి తొలిపూజా కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ఆహ్వాన పత్రికను
అందజేశారు. మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటి, శ్రీ గణేష్ ఉత్సవ కమిటి సభ్యుల ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. వినాయక చవితి రోజు ఉదయం 11 గంటలకు తొలిపూజకు దంపతులతో కలిసి హాజరుకావాలని కొరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ఎన్.అశోక్ బాక్సర్, ఎం. మహేందర్‌బాబు, ఎం. మహేష్ యాదవ్, ఎస్. రాజ్‌కుమార్, సందీప్రిజ్ తదితరులు ఉన్నారు.
==============================

