కమాన్ పూర్,అర్జున్ సమాచారం:
మనసును, శరీరాన్ని ఏకం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించేదే యోగ అని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు అన్నారు.
శనివారం జీఎం కార్యాలయంలో శ్రీ పరివార్ యోగా వారి ఆధ్వర్యంలో యోగా గురుజి రఘు సింగ్ బాపూజీ యోగ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిబ్బందికి యోగాసనాలు, వాటి ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జీఎంలు మాట్లాడుతూ నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను పొందవచ్చన్నారు. ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఏకాగ్రత, శారీరక దృఢత్వం పెంపొందించడంలో యోగా ఎంతో ఉపయోగకరమని తెలిపారు.ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కొంత సమయం యోగాకు కేటాయించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్వోటుజియంలు యం.రామ్మోహన్, బండి సత్యనారాయణ, విభాగధిపతులు బి.సుదర్శనం, సి.జె.సురేఖ, కె.ఐలయ్య, అఫ్సర్ పాషా, ఆర్.రాజేశ్వరి, షబ్బీరుద్ధీన్, మాజీ అధికారి ఇ.లక్ష్మీనారాయణ, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
============================

