ePaper
Saturday, September 19, 2026
ePaper
Homeతెలంగాణలండన్ కు సురేఖ,

లండన్ కు సురేఖ,

📰 Generate e-Paper Clip

లండన్ కు సురేఖ,

వరంగల్ సెప్టెంబర్ 15, (అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 15)

మంత్రిగా చక్రం తిప్పాల్సిన కొండా సురేఖ సారీ చెప్పలేదని మంత్రి పదవి తీసేశారని తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు సారీ చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో మాత్రంచెప్పుకోవడం లేదు. రాజకీయ ఆశయాల కోసం కుమార్తె అతిగా ఆవేశపడటంతోనే సమస్యలు వచ్చాయి. కుమార్తెకు రాజకీయం నేర్పే ప్రయత్నం చేయకపోగా తాము కూడా ఆమె బాటలోనే వెళ్లారు.ఇప్పుడు అన్నీ కోల్పోయాక.. కొన్నాళ్లు సైలెంట్‌గా ఉండాలనుకుంటున్నారు.సుస్మిత ప్రస్తుతం లండన్ వెళ్లిపోయారని తెలుస్తోంది. కొన్నాళ్ల పాటు అక్కడే ఉండాలనుకుంటున్నారు. తన వల్ల తల్లి మంత్రి పదవి పోయిందని ఆమె బాధపడుతున్నారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్యూలో కన్నీరు పెట్టుకున్నారు కూడా. ఈ అంశం వల్ల ఇంకా ఎక్కువ సమస్యలు రాకూడదని కొన్నాళ్లు ఆమె లండన్వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.కార్యకర్తల్లో తమకు ఉన్న పట్టు నిరూపించుకోవడమే కొండా దంపతులకు ప్రస్తుతం పెద్ద టాస్క్. రాబోయే వరంగల్ మహానగర పాలక సంస్థ కార్పొరేషన్ఎన్నికలను వీరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దశాబ్దాలుగా తమ వెంట నడిచిన పాత కార్యకర్తలకు, నమ్మకస్తులైన అనుచరులకు కార్పొరేటర్ టికెట్లు ఇప్పించుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలురచిస్తున్నారు. ఒకవేళ పార్టీ పరంగా కొన్ని స్థానాల్లో సమన్వయ లోపం వచ్చినా లేదా కాంగ్రెస్ టికెట్ దక్కకపోయినా, తమ మద్దతుదారులను స్వతంత్ర అభ్యర్థులుగానైనా బరిలోకి దించి గెలిపించుకోవాలని,తద్వారా వరంగల్ నగరంలో కొండా మార్క్ ఆధిపత్యాన్ని చాటాలని భావిస్తున్నారు.మంత్రి పదవి కోల్పోవడం కొండా సురేఖను మానసికంగా కుంగదీసినప్పటికీ, రాజకీయంగా వెనక్కి తగ్గే ఆలోచనలో కొండాదంపతులు లేరు. కాంగ్రెస్ పార్టీ కన్నా.. తన. బలమే ఎక్కువ అని నిరూపించేలా వరంగల్ కార్పొరేషన్ , పరకాల స్థానాల్లో సొంత వర్గాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారా హైకమాండ్‌కు తమ అవసరమైనశక్తినంతా నిరూపించుకోవాలని చూస్తున్నారు. రాజకీయంలో తాత్కాలిక వెనుకంజలు సహజమే అయినప్పటికీ, కార్యకర్తల బలంతో మళ్లీ పుంజుకుని కుమార్తెకు తిరుగులేని రాజకీయ భరోసా ఇవ్వడమేకొండా కుటుంబం ముందున్న ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!