అర్జున్ సమాచారం:
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం వేకువ జామున పురిటి బిడ్డ మృతి చెందాడు. బాధితుల కథనం ప్రకారం.. పుంగనూరు పట్టణానికి చెందిన సాదిక్ భాషా భార్య సుమియా సుల్తానా 2 రోజుల క్రితం పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరింది. డెలివరీ ఆలస్యం కావడంతో స్థానిక సిబ్బంది సలహాతో జిల్లా ఆస్పత్రిలో నీటి కొరత కారణంగా స్నానం చేసుకోని గురువారం బసినికొండలోని బంధువుల ఇంటికివెళ్లి, స్నానం చేసి అదేరోజే రాత్రి 10.30 గంటలకు తిరిగి ఆసుపత్రిలో జాయిన్ అయ్యింది. వైద్యులు పరీక్షించి సాధారణ ప్రసవ సమయంలో తల ముందు రాకుండా పేగు ముందుగా వచ్చి బేబీ మృతి చెందిందన్నారు. మరిన్ని వివరాలను అస్పత్రి అధికారులు వెల్లడించాల్సి ఉంది..
===========================
మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో పురిటి బిడ్డ మృతి
RELATED ARTICLES

