న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ బెంగళూరు లో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్లో న్యాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. బెంగళూరు ఎప్పుడు వచ్చినా సరే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ ప్రేక్షకులు ఎంతగానో ప్రేమ, ఆదరణ చూపిస్తారు. ప్రేక్షకుల ప్రేమ, ఆదరణకు నేను ఎప్పుడూ కృతజ్ఞతలు ఉంటాను. ‘ప్యారడైజ్’ నా కెరీర్లో చాలా ప్రతిష్టాత్మక చిత్రం. నా కెరీర్లో ఎక్కువ రోజులు షూటింగ్ చేసిన సినిమా ఇదే. అలాగే ఎక్కువ హార్డ్ వర్క్ చేసిన సినిమా కూడా ఇదే. ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతి అందించడానికి మేము ఎక్కడా రాజీ పడకుండా వర్క్ చేశాం. తప్పకుండా మీరు బిగ్ స్క్రీన్ మీద చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది యాక్షన్ డ్రామా. ఈ జానర్ లో చాలా సినిమాలు వచ్చి ఉండొచ్చు. కాకపోతే ‘ప్యారడైజ్’ లాంటి ఇంటెన్సిటీ, వరల్డ్ బిల్డింగ్, ఎనర్జీ, ఎమోషన్స్ ఉన్న సినిమా ఇప్పటివరకు రాలేదు. అలాగే అనిరుధ్ అద్భుతమైన స్కోర్ చేశారు. మోహన్ బాబు గారు, సోనాలి కులకర్ణి గారు, రాఘవ్.. ఇలా అందరూ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్లందరితో కలిసి నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నాను.
గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం. ఇందులో ఉండే హై మూమెంట్స్ అన్నీ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. ఇందులో ఉండే ఎమోషన్ మీ అందరినీ కదిలిస్తుంది. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఒక స్పెక్టక్యులర్గా ఉంటాయి. ‘ప్యారడైజ్’ ఒక తల్లి, కొడుకుల కథ. అది అన్నిటికంటే గొప్ప ఎమోషన్. చాలా మంచి కమర్షియల్ ఎక్స్పీరియన్స్ సినిమా అవుతుంది. సెప్టెంబర్ 24న మీ అందరి ప్రేమ దొరుకుతుందని ఆశిస్తున్నాను. ఇంత ప్రేమ చూపిస్తున్న మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నాను. ఈ సినిమా జడల్ లుక్ కనుక ఒక మంచి ఉద్దేశం ఉంది. జడలు కథలో భాగంగా ఉంటుంది. మీ అందరి రెస్పాన్స్ చూడడానికి ఎదురుచూస్తున్నాను. మదర్-సన్ ఎమోషన్‌తో చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే ఇందులో ఉండే మదర్-సన్ కాన్ఫ్లిక్ట్ను మీరు ఎప్పుడూ చూసి ఉండరు.
కన్నడలో నా క్యారెక్టర్‌కు దీక్షిత్ డబ్బింగ్ చెప్పాడు. తను నటుడిగా చాలా బిజీగా ఉన్నప్పటికీ మా అందరి మీద ప్రేమతో వచ్చి డబ్బింగ్ చెప్పాడు. ఈ సినిమా కోసం నేను చాలా ఫిజికల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాను. ఈ సినిమా కన్నడలో చాలా మంచి క్వాలిటీతో డబ్ చేశాం. తెలుగు, కన్నడ రెండు భాషల్లోనూ ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో జడల ట్రెండ్ మళ్లీ మొదలవుతుందని భావిస్తున్నాను. సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. వారందరి కోసం ఈ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నాను.
============================

