ePaper
Saturday, September 19, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్దానం నాగేందర్‌ అనర్హతపై హైకోర్టు తీర్పును స్వాగతించిన బీజేపీ

దానం నాగేందర్‌ అనర్హతపై హైకోర్టు తీర్పును స్వాగతించిన బీజేపీ

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, సెప్టెంబర్ 18,అర్జున్ సమాచారం:
దానం నాగేందర్‌ అనర్హతకు సంబంధించిన కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును భారతీయ జనతా పార్టీ స్వాగతించింది. ప్రజాస్వామ్య పరిరక్షణ, న్యాయం కోసం బీజేపీ అనేక రోజులుగా పోరాటం చేస్తోందని బీజేపీఎల్పీ నేత తెలిపారు.
ఒక పార్టీ తరఫున గెలిచి, అనంతరం మరో పార్టీ తరఫున కొనసాగుతున్న దానం నాగేందర్‌ వ్యవహారంపై బీజేపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించిందని ఆయన పేర్కొన్నారు. స్పీకర్‌ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేయడం ప్రజాస్వామ్య పరిరక్షణకు కీలకమైన పరిణామమని, ఈ తీర్పు ప్రజాస్వామ్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని అన్నారు.
కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకుని, ఇతర పార్టీల నుంచి తమ వైపు వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రోత్సహించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శించింది.
బీజేపీ న్యాయం, ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం నిరంతరం పోరాడిందని, బీజేపీఎల్పీ నేతగా తాను దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచిందని తెలిపారు. సంబంధిత ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరాలని ఆయన డిమాండ్‌ చేశారు.
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లకుండా, తీర్పును గౌరవించి వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని కాంగ్రెస్‌ పార్టీని కోరారు. ఈ వ్యవహారంలో ప్రతివాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించకుండా ఉండేందుకు బీజేపీ తరఫున కేవియట్‌ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. కేవియట్‌ను రేపటిలోగా ఫైల్‌ చేస్తామని వెల్లడించారు.
ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్‌ పార్టీకి నిజమైన గౌరవం ఉంటే, పార్టీ మారిన ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించి ప్రజల తీర్పును స్వీకరించాలని బీజేపీ డిమాండ్‌ చేసింది.
============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!