ఉయ్యాలవాడ సమీపంలో వ్యక్తి దారుణ హత్య,
నంద్యాల: అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 19.
ఉయ్యాలవాడ మండలం ఆర్.పాంపల్లె గ్రామ సమీపంలో శనివారం దారుణ హత్య ఘటన చోటు చేసుకుంది. ఉయ్యాలవాడకు వచ్చే రహదారిలో రామయ్య కోనేరు సమీపంలో మోటార్ సైకిల్ పై వ్యక్తి వెళ్తున్న చింతకుంట నాగార్జున అనే వ్యక్తిని దుండగులు అడ్డగించి కళ్ళల్లో కారం కొట్టి కత్తులతో పొడిచి హత్య చేసినట్లు స్థానికులు ఆరోపించారు. సమీపంలోని పంట పొలాల్లోకి తీసుకువెళ్లి కత్తితో హత్య గావించారు. మృతదేహంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఘటనా స్థలాన్ని ఆళ్లగడ్డ డిఎస్పి శ్రీనివాసరావు సందర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

