తిరుపతి,అర్జున్ సమాచారం:
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అశేష భక్తజన సందోహం నడుమ అత్యంత నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో అత్యంత ప్రాశస్త్యమైన సూర్యప్రభ వాహన సేవలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు అందుకున్నారు.ఉదయం సర్వాభరణ భూషితుడై, తేజోరూపంలో భాసించే సూర్యప్రభ వాహనంపై శ్రీమలయప్ప స్వామి నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు.కార్యక్రమంలో తిరుపతి ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, టీటీడీ అధికారులు, సిబ్బంది మరియు అసంఖ్యాక భక్తజనం పాల్గొన్నారు. మాడ వీధుల పొడవునా భక్తులు చేసిన ‘గోవింద… గోవింద…’ నామస్మరణలతో శేషాచల పర్వతాలు ప్రతిధ్వనించాయి.
===========================

