ePaper
Tuesday, September 22, 2026
ePaper
Homeసినిమాకార్తికేయ హీరో,దర్శకుడిగా 'కమ్‌బ్యాక్' కొత్త సినిమా

కార్తికేయ హీరో,దర్శకుడిగా ‘కమ్‌బ్యాక్’ కొత్త సినిమా

📰 Generate e-Paper Clip

ట్యాలెంటెడ్ టాలీవుడ్ యంగ్ హీరోల్లో కార్తికేయ గుమ్మకొండ ఒకరు. ‘ఆర్ఎక్స్ 100’లో ఆయన నటనకు ఎంతో మంది అభిమానులు ఏర్పడ్డారు. హీరోగా మాత్రమే కాదు… నటుడిగానూ ప్రేక్షకుల మదిలో ఓ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. తనలో స్టైలిష్ విలన్ ఉన్నాడని ‘నానీస్ గ్యాంగ్ లీడర్‌’తో చూపించారు. కోలీవుడ్ స్టార్ అజిత్ ‘వలిమై’లో తనదైన విలనిజంతో తమిళ ప్రేక్షకులనూ ఆకట్టుకున్నారు. అయితే ఆయన నుంచి సినిమా వచ్చి రెండేళ్ళు దాటుతోంది. ఇప్పుడు కార్తికేయ గుమ్మకొండ మళ్ళీ కమ్‌బ్యాక్ ఇస్తున్నారు.
కథానాయకుడిగా రెండేళ్ళ విరామం తర్వాత కార్తికేయ గుమ్మకొండ చేస్తున్న సినిమా ‘కమ్‌బ్యాక్’. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే… ‘కమ్‌బ్యాక్‌’తో కార్తికేయ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న సినిమాను ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 21న అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు ఆయన సతీమణి లోహితా రెడ్డి నిర్మాత.
‘బాక్సింగ్ వరల్డ్‌లో తన పేరు వినిపించి మూడేళ్ళు అవుతోంది. నేనింకా ప్రొఫెషన్ మారిపోయి ఉంటాడేమో అనుకున్నాను. మూడేళ్ళు అవుతుందని నీకు గుర్తు అన్నా ఉంది. అది నాకు కూడా లేదు. అయినా ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు? యా… దట్స్ ట్రూ (అది నిజమే). ఇట్ ఫీల్స్ లైక్ సూసైడ్ మిషన్ (ఓ విధంగా అది ఆత్మహత్య చేసుకోవడమే). మూడేళ్ళ నుంచి ఏమైపోయాడో తెలియలేదు. ఇన్ని రోజులు ఏం చేస్తున్నాడు?’ అని వాయిస్ ఓవర్ వినిపిస్తున్న సమయంలో తెరపై టెక్నీషియన్ల పేర్లు పరిచయం చేశారు. ఆ తర్వాత స్కిప్పింగ్, బాక్సింగ్ చేస్తున్న హీరోని చూపించారు. కార్తికేయ ఎప్పటిలా ఫిట్‌గా, హ్యాండ్సమ్‌గా కనిపించారు. విజయ్ బుల్గానిన్ అందించిన నేపథ్య సంగీతం చాలా బావుంది. ఆ తర్వాత ‘కమ్‌బ్యాక్’ టైటిల్ ప్రకటించారు. ఇందులో హీరో బాక్సర్ రోల్ చేస్తున్నారని గ్లింప్స్ ద్వారా చెప్పారు.
కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రూపొందిస్తున్న ‘కమ్‌బ్యాక్’ సినిమాకు సమర్పణ: సరస్వతి శుక్లా, సినిమాటోగ్రఫీ: జగదీశ్ చీకటి, ప్రొడక్షన్ డిజైనర్: కేఆర్ కుమార్ మన్నే, మ్యూజిక్ డైరెక్టర్: విజయ్ బుల్గానిన్, ఎడిటర్: కళ్యాణ్ సూర్యప్రకాష్, కాస్ట్యూమ్ డిజైనర్: శిల్పా టంగుటూరు, లైన్ ప్రొడ్యూసర్: ఎస్ కిషోర్ మచ్చా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్ తేలప్రోలు, క్రియేటివ్ డైరెక్టర్: సూర్య ఆకెళ్ళ, ప్రొడ్యూసర్: లోహితా రెడ్డి, రైటర్ & డైరెక్టర్: కార్తికేయ గుమ్మకొండ, మార్కెటింగ్: టాక్ స్కూప్, పీఆర్వో: పులగం చిన్నారాయణ

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!