ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్కాంగ్రెస్ బిఆరెస్ కుమ్మక్కయ్యారు ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు మీ రాజకీయ డ్రామాలు ఆపండి...

కాంగ్రెస్ బిఆరెస్ కుమ్మక్కయ్యారు ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు మీ రాజకీయ డ్రామాలు ఆపండి ఎంపి ఈటల

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కుమ్మక్కయ్యారని ఎంపి ఈటల రాజేందర్ ఆరోపించారు.  మిమ్మల్ని చూసి ప్రజలు అసహ్యుంచుకుంటున్నారు.  పంటలు ఎండడం చూస్తుంటే పల్లె పల్లెల పల్లెర్లు మొలిచాయి అనే పాట గుర్తుకు వస్తుంది.  ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది, పోయేకాలం వచ్చింది.  గోదావరిలో నీళ్లు పారుతున్నప్పుడు ఎత్తి పోయకుండా కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇదని అన్నారు.
ఒకపక్క నీళ్లు లేక మరోపక్క కరెంటు కోతలతో పంటలు ఎండుతుంటే.. రోమ్ నగరం తగలబడుతుంటే పిడేలు వహించినట్లు ఉంది రేవంత్ రెడ్డి వ్యవహారం.   జూరాల నీళ్లు ఇవ్వాలని వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను.   ప్రతిపక్ష నేతలను నిర్బంధించడం ఆపి రైతులకు నీళ్లు, కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా.  బిఆర్ఎస్ వారి ఆస్తుల మీద విచారణకు మూడేళ్లుగా ఏం చేశారు. రేవంత్ నీకు నిజాయితీ లేదు.  23 లక్షల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని చెప్తున్న మీరు ఇన్నాళ్లు ఏం చేశారు ?  ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫార్ములా వన్ కేసులు ఏమయ్యాయి.   ఫాం హౌస్ ల డ్రామాలు పక్కన పెట్టి ప్రజలకు నీళ్లు కరెంటు ఇవ్వాలి.  బీజేపీ మాత్రమే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది.   కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది బీజేపీనే.   మూసీ, 22 ఏ మీద పోరాటం చేయడానికి brs కి ముఖం లేదు.   హైడ్రా, మూసీ, 22 ఏ, ఫీజు రీఎంబర్స్మెంట్, ఉద్యోగాలు, పంటలకు నీళ్ల కోసం పోరాటం చేస్తున్న పార్టీ బీజేపీ.   ఇకనైనా రెండు పార్టీల డ్రామాలు పక్కన పెట్టి రైతులను ఆదుకోవాలని అన్నారు.
==========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!