ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeసినిమా"రణబాలి" మూవీ నుంచి 'ఏందయ్య సామీ' లిరికల్ సాంగ్

“రణబాలి” మూవీ నుంచి ‘ఏందయ్య సామీ’ లిరికల్ సాంగ్

📰 Generate e-Paper Clip

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా “రణబాలి” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ చిత్రం నుంచి ‘ఏందయ్య సామీ..’ ఫుల్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ..ఐదు భాషల్లో ఈ పాటను విడుదల చేశారు.
“రణబాలి”లో విజయ్, రశ్మిక పెళ్లి వేడుక సందర్భంగా ‘ఏందయ్య సామీ..’ పాట చిత్రీకరించారు. 19వ శతాబ్దంలో  పెళ్లి సందడి ఎంత సంప్రదాయంగా ఉండేదో ‘ఏందయ్య సామీ..’ పాటలో అందంగా రూపొందించారు. ఈ పాటను అజయ్ అతుల్ మెలొడియస్ గా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన లిరిక్స్ అందించగా, శ్వేతా మోహన్, అజయ్ గోగవలే మధురంగా పాడారు. ‘ఏందయ్య సామీ..’ పాట ఎలా ఉందో చూస్తే – ‘ఏందయ్యా సామీ ఇట్ట గాస్తాందీ వెన్నెల, ఊపేస్తా ఉంది సిత్తరాలా ఉయ్యాలా, వీచే గాలికి అత్తరద్దిందెవ్వరు, మారే ఝాముకి మందుపెట్టిందెవ్వరు, మాయదారి మనస్సాగక జాగరమన్నరా…’ అంటూ మళ్లీ మళ్లీ వినాలనిపించేలా సాగుతుందీ పాట.
19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా “రణబాలి” సినిమా రూపొందుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్ లో ఆసక్తి కలిగిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్ మూవీపై అంచనాలు మరింతగా పెంచేసింది.
నటీనటులు – విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ, తదితరులు
=======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!