ePaper
Friday, October 2, 2026
ePaper
Homeఆరోగ్యంతల్లికి వైద్యం అందలేదని.. అర్ధరాత్రి వీల్‌చైర్‌లో ఎమ్మెల్యే ఇంటికి..రెండు కిలోమీటర్లు తల్లిని తోసుకెళ్లిన కుమారుడు.

తల్లికి వైద్యం అందలేదని.. అర్ధరాత్రి వీల్‌చైర్‌లో ఎమ్మెల్యే ఇంటికి..రెండు కిలోమీటర్లు తల్లిని తోసుకెళ్లిన కుమారుడు.

📰 Generate e-Paper Clip

తల్లికి వైద్యం అందలేదని.. అర్ధరాత్రి వీల్‌చైర్‌లో ఎమ్మెల్యే ఇంటికి..రెండు కిలోమీటర్లు తల్లిని తోసుకెళ్లిన కుమారుడు.

అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 30. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల: ప్రభుత్వ ఆస్పత్రిలో తన తల్లికి సరైన వైద్యం అందలేదని ఆరోపిస్తూ ఓ కుమారుడు అర్ధరాత్రి చేసిన చర్య స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న తల్లిని వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి సుమారు రెండు కిలోమీటర్లు తోసుకుంటూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌రావు నివాసానికి తీసుకెళ్లిన ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పులిమడుగు గ్రామానికి చెందిన భూక్యా బుజ్జి(55) కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో కుమారుడు భూక్యా రాజ్‌కుమార్‌ ఆమెను మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అర్ధరాత్రి సమయంలో ఆస్పత్రిలో సిబ్బంది అందుబాటులో లేకపోయారని రాజ్‌కుమార్‌ ఆరోపించారు. తన తల్లి తీవ్ర అస్వస్థతతో ఉన్నప్పటికీ వైద్యం అందించాలని కోరినా స్పందించలేదని, పడక కూడా కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బంది తనపై దాడి చేశారని కూడా ఆయన ఆరోపించారు.
దీంతో చేసేదేమీ లేక తల్లిని అదే వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి ఆస్పత్రి నుంచి బయటకు తీసుకువచ్చారు. రాత్రి సమయంలో సుమారు రెండు కిలోమీటర్లు వీల్‌చైర్‌ను తోసుకుంటూ ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌రావు నివాసానికి చేరుకున్నారు.
విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఆస్పత్రి ఆర్‌ఎంవో శ్రీధర్‌ వెంటనే ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. అనంతరం బుజ్జికి వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఆమెను తిరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
తల్లికి సకాలంలో వైద్యం అందలేదన్న ఆరోపణలతో కుమారుడు అర్ధరాత్రి వీల్‌చైర్‌లో ఆమెను ఎమ్మెల్యే నివాసానికి తీసుకెళ్లిన ఘటన మంచిర్యాలలో చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!