ePaper
Saturday, October 3, 2026
ePaper
Homeతెలంగాణపరిశుభ్రతతోనే ప్రగతి.. సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో సామూహిక శుభ్రత-పరిశుభ్రమైన కార్యాలయాలే లక్ష్యం.. అక్టోబర్‌ 31...

పరిశుభ్రతతోనే ప్రగతి.. సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో సామూహిక శుభ్రత-పరిశుభ్రమైన కార్యాలయాలే లక్ష్యం.. అక్టోబర్‌ 31 వరకు ప్రత్యేక కార్యక్రమాలు.

📰 Generate e-Paper Clip

పరిశుభ్రతతోనే ప్రగతి.. సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో సామూహిక శుభ్రత-పరిశుభ్రమైన కార్యాలయాలే లక్ష్యం.. అక్టోబర్‌ 31 వరకు ప్రత్యేక కార్యక్రమాలు.

మంచిర్యాల:జైపూర్ మండలం:సింగరేణి, అక్టోబర్‌ 03.

పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం కార్యనిర్వాహక సంచాలకులు చెన్నకేశవుల చిరంజీవి పిలుపునిచ్చారు.కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం 6.0లో భాగంగా శనివారం సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ప్రాంగణంలో సామూహిక శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. అక్టోబర్‌ 2 నుంచి 31వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా కార్యాలయాలు, పని ప్రదేశాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వాహక సంచాలకులు చెన్నకేశవుల చిరంజీవి మాట్లాడుతూ, శుభ్రత కార్యక్రమాలు ఒక్కరోజుకే పరిమితం కాకుండా నిరంతరం కొనసాగాలని సూచించారు. కార్యాలయ ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అందుబాటులో ఉన్న స్థలాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. పాత రికార్డులను క్రమబద్ధీకరించడం, అవసరం లేని పత్రాలను తొలగించడం, పనికిరాని వస్తువులు, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను నిబంధనల ప్రకారం తొలగించడం ద్వారా పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించవచ్చని పేర్కొన్నారు.
ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కార్యాలయ పరిసరాల సుందరీకరణ, భౌతిక, ఎలక్ట్రానిక్‌ రికార్డుల సమీక్ష, పాత పత్రాల తొలగింపు, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల వేర్పాటు, పనికిరాని వస్తువుల క్రమబద్ధీకరణ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.అనంతరం విద్యుత్‌ కేంద్రం ప్రాంగణంలోని బీఎండీ పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన సామూహిక శుభ్రత కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. పరిసరాలను శుభ్రం చేసి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేశారు.ఈ కార్యక్రమంలో ఏజీఎం వి.వి. సుధాకర్‌ రెడ్డి, ఏఐటీయూసీ పిట్‌ కార్యదర్శి సత్యనారాయణ, సీఎంఓఏఐ అధ్యక్షులు డి. పంతులు, చీఫ్‌ కె. శివప్రసాద్‌, డీజీఎం సి.హెచ్‌. వాసుదేవ మూర్తి, వ్యక్తిగత విభాగాధిపతి ఎస్‌.వి. రాజేశ్వర్‌ రావుతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు అక్టోబర్‌ 31 వరకు ప్రత్యేక కార్యక్రమం కొనసాగనున్న నేపథ్యంలో పరిశుభ్రత, రికార్డుల క్రమబద్ధీకరణ, స్థలాల సమర్థ వినియోగం, వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన పనులను నిర్ణీత ప్రణాళిక ప్రకారం పూర్తి చేయనున్నా

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!