ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు! జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు హెచ్చరిక.. తనిఖీల్లో 55 జరిమానాలు, రెండు కేసులు నమోదు.
అర్జున్ సమాచారం. అక్టోబర్ 03. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.
జైపూర్ మండలం: 03అక్టోబర్ వాహనదారులు రహదారి భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు సూచించారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ నవీన్ కుమార్ పర్యవేక్షణలో ఎస్ఐ బుమేష్ ఆధ్వర్యంలో శనివారం జైపూర్ పరిధిలో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు చేపట్టిన ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై 55 జరిమానాలు విధించారు. రెండు డీడీ కేసులు నమోదు చేశారు.
నంబరు పలకలు లేకుండా వాహనాలు నడుపుతున్న ఐదుగురిని గుర్తించి, తక్షణమే నంబరు పలకలు ఏర్పాటు చేయించారు. వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, నంబరు పలకలు లేకుండా రహదారులపైకి రావద్దని పోలీసులు హెచ్చరించారు. ప్రజల ప్రాణ రక్షణ, రహదారి భద్రతే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఏసీపీ వెంకటేశ్వర్లు కోరారు.

