మంథని ఖాతాదారులతో గోదావరి అర్బన్ బ్యాంక్ ఆత్మీయ అనుబంధం.
అర్జున్ సమాచారం//అక్టోబర్ 3//మంథని డెస్క్.
నాందేడ్ హెడ్ ఆఫీస్‌లో వార్షిక సాధారణ సమావేశానికి హాజరైన మంథని ఖాతాదారులు.
నాందేడ్: మంథని ప్రాంతానికి చెందిన గోదావరి అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులు నాందేడ్‌లోని బ్యాంక్ హెడ్ ఆఫీస్‌ను సందర్శించారు. బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో పాల్గొని బ్యాంక్ యాజమాన్యంతో ఆత్మీయంగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా బ్యాంక్ వ్యవస్థాపకులు, చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంథని ప్రాంత ఖాతాదారులు ప్రత్యేకంగా నాందేడ్ హెడ్ ఆఫీస్‌కు వచ్చి సమావేశంలో పాల్గొనడం పట్ల చైర్పర్సన్ సంతోషం వ్యక్తం చేశారు.
మంథని ప్రాంత ఖాతాదారులు బ్యాంక్‌పై చూపిస్తున్న ఆదరణ అభినందనీయమని, వారి రాక సంతోషాన్ని కలిగించిందని చైర్పర్సన్ పేర్కొన్నారు. త్వరలోనే గోదావరి అర్బన్ బ్యాంక్ మంథని శాఖను సందర్శిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంథని శాఖ మేనేజర్ నాగుల రమేష్, కొరవేణ రమేష్, లక్కాకుల శంకర్‌తో పాటు ఖాతాదారులు సిరిపురం సురేష్, గాదె శంకర్, రావుల సతీష్, రేగటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
బ్యాంక్ యాజమాన్యం, సిబ్బంది, ఖాతాదారుల మధ్య ఉన్న పరస్పర విశ్వాసం, ఆత్మీయ అనుబంధానికి ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు. మంథని ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు గోదావరి అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

