రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు మంథని విద్యార్థులు.
అర్జున్ సమాచారం // అక్టోబర్ 4 // మంథని రిపోర్టర్.
మంథని పట్టణానికి చెందిన జేకేఏ షోటోఖాన్ కరాటే విద్యార్థులు అండర్-19 ఎస్జీఎఫ్ఐ రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపికైనట్లు కరాటే శిక్షకులు కొండ్ర నాగరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇటీవల జరిగిన ఎంపిక పోటీల్లో తోట హాసిని, దేవాన్ష్ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్స్ సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో ఖమ్మంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో వారు పాల్గొంటారని పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను జేకేఏ సౌత్‌జోన్ ఇన్చార్జి రాపోలు సుదర్శన్, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూకల బానయ్య, తెలంగాణ పేటా ఉపాధ్యక్షుడు, ఫిజికల్ డైరెక్టర్ కొమురోజు శ్రీనివాస్, జూనియర్ కోచ్ బొడ్డేళ్ల ఇంద్రాణి, పెద్దపల్లి జిల్లా కరాటే మాస్టర్స్ అభినందించారు.

