ePaper
Tuesday, October 6, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్బెల్లంపల్లి హనుమాన్ బస్తీలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి… ఏడుగురు అరెస్ట్.

బెల్లంపల్లి హనుమాన్ బస్తీలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి… ఏడుగురు అరెస్ట్.

📰 Generate e-Paper Clip

బెల్లంపల్లి హనుమాన్ బస్తీలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి… ఏడుగురు అరెస్ట్.

అర్జున్ సమాచారం అక్టోబర్5 బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి.

మంచిర్యాల జోన్ పరిధిలోని బెల్లంపల్లి పట్టణం హనుమాన్ బస్తీ ప్రాంతంలో డబ్బులు పందెంగా పెట్టి అక్రమంగా పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ దీకొండ రమేష్ మరియు సిబ్బంది ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా దాడి నిర్వహించారు.
బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ బస్తీలో నిర్వహించిన ఈ దాడిలో అక్రమంగా పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి 52 పేకముక్కలు, రూ.10,480 నగదు, 7 మొబైల్ ఫోన్లు, ఒక హీరో హోండా సీడీ 100 ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న ఏడుగురు వ్యక్తులతో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, పేకముక్కలు, మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
అక్రమ పేకాట, జూదం వంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!