ePaper
Thursday, October 8, 2026
ePaper
Homeతెలంగాణబాలికలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి.,అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు.

బాలికలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి.,అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు.

📰 Generate e-Paper Clip

బాలికలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి.,అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు.

మంథని ప్రథమ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆర సుధారాణి.

అర్జున్ సమాచారం: అక్టోబర్ 8: రామగిరి రిపోర్టర్ :

బాలికలు తమ హక్కులు, రక్షణ కోసం ఉన్న చట్టాలపై అవగాహన పెంచుకోవాలని మంథని ప్రథమ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆర సుధారాణి సూచించారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మంథని న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో రామగిరి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా బాలికలకు అందుబాటులో ఉన్న న్యాయ పరిరక్షణ, ఉచిత న్యాయ సేవలు, హక్కులపై అవగాహన కల్పించారు. బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా చట్టపరమైన సహాయం పొందాలని జడ్జి సూచించారు. తమ హక్కులను తెలుసుకుని, వాటిని పరిరక్షించుకునే విధంగా అవగాహన పెంచుకోవాలని తెలిపారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారి పి. మంజుల, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రఘోత్తం రెడ్డి, రామగిరి ఎస్‌ఐ తాడవేని శ్రీనివాస్, న్యాయవాదులు శశిబూషణ్ కాచే, మంథని శ్రీనివాస్, ఎండీ. షబానా, అశోక్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!