ePaper
Friday, October 9, 2026
ePaper
Homeతెలంగాణకాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.ఆర్‌జీ-3 జీఎంకు ఐఎన్‌టీయూసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వినతి

కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.ఆర్‌జీ-3 జీఎంకు ఐఎన్‌టీయూసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వినతి

📰 Generate e-Paper Clip

కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.ఆర్‌జీ-3 జీఎంకు ఐఎన్‌టీయూసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వినతి.

రామగిరి: అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 9.

సింగరేణి ఆర్‌జీ-3 ఏరియాలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐఎన్‌టీయూసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్‌జీ-3 ఏరియా జీఎంకు వినతిపత్రం అందజేశారు. యూనియన్ ఆర్‌జీ-3 ఇన్‌చార్జి మబ్బు శంకర్ ఆధ్వర్యంలో నాయకులు కార్మికుల సమస్యలను జీఎం దృష్టికి తీసుకెళ్లారు.

సింగరేణి సర్క్యులర్ ప్రకారం ప్రతి నెల ఏడో తేదీలోపు కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు చెల్లించాలని కోరారు. సెక్యూరిటీ విభాగంలో శ్రీజ కంపెనీకి చెందిన కార్మికులకు బకాయిపడిన 15 రోజుల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాల చెల్లింపులో జాప్యం జరిగితే బాధిత సెక్యూరిటీ కార్మికులకు ఐఎన్‌టీయూసీ అండగా ఉంటుందని యూనియన్ నాయకులు తెలిపారు.

అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన సీఎంపీఎఫ్ చిట్టాలను అందజేయడంతోపాటు, వాటి వివరాలను ముందుగానే కార్మికులకు తెలియజేయాలని కోరారు.

సింగరేణి కార్మికులకు ప్రభుత్వం ప్రకటిస్తున్న రూ.5,500 బోనస్ చెల్లింపు విషయంలో గతంలో నిర్లక్ష్యం జరిగిందని యూనియన్ నాయకులు పేర్కొన్నారు. ఈసారి అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ముందస్తుగానే కార్మికుల వివరాలను సేకరించి సిద్ధంగా ఉంచాలని జీఎంను కోరారు. కార్మికుల సమస్యలను సకాలంలో పరిష్కరించి వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఉడుత శంకర్ యాదవ్, రీజినల్ జనరల్ సెక్రటరీ బండ కిరణ్ రెడ్డి, సెక్యూరిటీ ఇన్‌చార్జి శ్రీరాముల కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!