ప్రజల అవసరాల మేరకు స్పందించిన సర్పంచ్. ఇల్లందుల సంజీవ్.,ఆదివారంపేట స్మశానవాటికలో ప్లాట్‌ఫారం పనులు చేపట్టిన సర్పంచ్.
అర్జున్ సమాచారం// అక్టోబర్ 10 // రామగిరి రిపోర్టర్.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆదివారంపేట గ్రామపంచాయతీ పరిధిలోని స్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించే సమయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రజల అవసరాల మేరకు స్పందించిన గ్రామ సర్పంచ్ ఇల్లందుల సంజీవ్ స్మశానవాటికలో ప్లాట్‌ఫారం నిర్మాణ పనులు చేపించారు.
దహన సంస్కారాల సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు స్మశానవాటికలో అవసరమైన సదుపాయాల కల్పనకు సర్పంచ్ చర్యలు తీసుకున్నారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మైదం వెంకటేష్, చింతల అనిల్, యువజన నాయకుడు మైదం అనిల్, దాస్పెల్లి అంజిరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

