ePaper
Saturday, October 10, 2026
ePaper
Homeతెలంగాణరెండు స్వర్ణాలతో మెరిసిన చికిత”యువ ఆర్చర్‌ను సన్మానించిన ,బండారు దత్తాత్రేయ”ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు.

రెండు స్వర్ణాలతో మెరిసిన చికిత”యువ ఆర్చర్‌ను సన్మానించిన ,బండారు దత్తాత్రేయ”ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు.

📰 Generate e-Paper Clip

రెండు స్వర్ణాలతో మెరిసిన చికిత”యువ ఆర్చర్‌ను సన్మానించిన ,బండారు దత్తాత్రేయ”ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు.

హైదరాబాద్:అర్జున్ సమాచారం ప్రతినిధి అక్టోబరు 10.

2025 ప్రపంచ యూత్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ ప్రతిభసుల్తానాపూర్‌ యువతికి అంతర్జాతీయ గుర్తింపురెండు స్వర్ణాలతో దేశానికి కీర్తి తెచ్చిన ఆర్చర్‌ చికిత,యువ క్రీడాకారిణి తనిపర్తి చికితకు బండారు దత్తాత్రేయ సన్మానం.


అంతర్జాతీయ స్థాయిలో ఆర్చరీ క్రీడలో అద్భుత ప్రతిభ కనబరిచి రెండు స్వర్ణ పతకాలు సాధించిన యువ క్రీడాకారిణి తనిపర్తి చికితను మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ శనివారం ఘనంగా సన్మానించారు.

హైదరాబాద్‌ లోని రాంనగర్‌లో ఉన్న తన నివాసంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తానాపూర్‌ గ్రామానికి చెందిన చికిత ఇటీవల జరిగిన 2026 ఆసియా క్రీడల్లో కాంపౌండ్‌ ఆర్చరీ మహిళల జట్టు, మిక్స్‌డ్‌ జట్టు విభాగాల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు.

అంతేకాకుండా, 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో భారత్‌కు తొలి ఒలింపిక్‌ కోటా సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

2025లో జరిగిన వరల్డ్‌ ఆర్చరీ యూత్‌ ఛాంపియన్‌షిప్‌లో అండర్‌-21 వ్యక్తిగత విభాగంలో ప్రపంచ టైటిల్‌ సాధించిన తొలి భారతీయ మహిళా కాంపౌండ్‌ ఆర్చర్‌గా చికిత రికార్డు సృష్టించారు.

 అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తున్న యువ క్రీడాకారిణిని ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ అభినందించి, ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!