ePaper
Saturday, October 10, 2026
ePaper
Homeతెలంగాణగ్రామాభివృద్ధికి సల్మాన్‌ ఖాన్‌ కృషి మరువలేనిది,సల్మాన్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలిగ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి,మంథని మాజీ ఎమ్మెల్యే...

గ్రామాభివృద్ధికి సల్మాన్‌ ఖాన్‌ కృషి మరువలేనిది,సల్మాన్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలిగ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి,మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌.

📰 Generate e-Paper Clip

గ్రామాభివృద్ధికి సల్మాన్‌ ఖాన్‌ కృషి మరువలేనిది,సల్మాన్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలిగ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి,మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌.

అర్జున్ సమాచారం // అక్టోబర్10// మహదేవ్‌పూర్‌.డెస్క్.

మహదేవ్‌పూర్‌ గ్రామాభివృద్ధికి మాజీ ఉపసర్పంచ్‌ సల్మాన్‌ ఖాన్‌ చేసిన సేవలు, కృషి మరువలేనివని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. మహదేవ్‌పూర్‌లో మాజీ ఉపసర్పంచ్‌ సల్మాన్‌ ఖాన్‌ స్మారకార్థం నిర్వహిస్తున్న క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పుట్ట మధూకర్‌ మాట్లాడుతూ సల్మాన్‌ ఖాన్‌ నేడు మన మధ్య లేకపోవడం బాధాకరమని, ఆయన స్మారకంగా క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మాటల కంటే చేతలే ముఖ్యం

మాటలు చెప్పడం కంటే ఆచరణలో చూపించడం ముఖ్యమని, సల్మాన్‌ ఖాన్‌ తన పనితీరుతో అనేక విషయాల్లో గొప్ప సందేశాన్ని ఇచ్చారని పుట్ట మధూకర్‌ గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పలుచోట్ల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌ల మధ్య భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నప్పటికీ, మహదేవ్‌పూర్‌లో సర్పంచ్‌ నిర్ణయానికి కట్టుబడి ఉపసర్పంచ్‌గా సల్మాన్‌ ఖాన్‌ పనిచేశారని తెలిపారు. ఆయనలో నమ్మకం, ధైర్యం, ఉత్సాహం మెండుగా ఉండేవని పేర్కొన్నారు.

క్రీడాకారులకు ప్రోత్సాహం అవసరం,

మంథని నియోజకవర్గంతో పాటు మహదేవ్‌పూర్‌ ప్రాంతంలోని గ్రామీణ క్రీడాకారులకు సల్మాన్‌ ఖాన్‌ స్మారక క్రికెట్‌ టోర్నమెంట్‌ ఎంతగానో ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఈ ప్రాంతానికి చెందిన యువతలో అపారమైన ప్రతిభ ఉందని, సరైన అవకాశాలు, ప్రోత్సాహం లేక చాలామంది క్రీడాకారులు తమ నైపుణ్యాలను నిరూపించుకోలేకపోతున్నారని అన్నారు. పలిమెల మండలానికి చెందిన ఓ క్రీడాకారిణి త్రోబాల్‌లో బంగారు పతకం సాధించడం ఈ ప్రాంత యువత ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు.

చదువు, క్రీడలు సహా అన్ని రంగాల్లో గ్రామీణ ప్రాంతాల యువతకు తగిన ప్రోత్సాహం అందించాలని సూచించారు. ఎక్కడ అవకాశం లభించినా గ్రామీణ క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.

ప్రతి ఏటా టోర్నమెంట్‌ నిర్వహించాలి,

సల్మాన్‌ ఖాన్‌ స్మారకార్థం నిర్వహిస్తున్న క్రికెట్‌ పోటీలను ఈ ఏడాదికే పరిమితం చేయకుండా ప్రతి సంవత్సరం కొనసాగించాలని పుట్ట మధూకర్‌ నిర్వాహకులకు సూచించారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, తన వంతు సహకారం కూడా అందిస్తానని హామీ ఇచ్చారు.

క్రీడా పోటీల నిర్వహణలో బంధుప్రీతి, ప్రాంతీయాభిమానాలకు తావులేకుండా ప్రతిభకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. గతంలో మంథని ప్రాంతంలోనూ ఇలాంటి పరిస్థితులు ఉండేవని, వాటిని అధిగమిస్తూ క్రీడా పోటీలను నిర్వహించిన సందర్భాలను గుర్తుచేశారు. గ్రామీణ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నైపుణ్యాలను పెంపొందించుకుని గొప్ప క్రీడాకారులుగా ఎదగాలని పుట్ట మధూకర్‌ ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!