మురిమడుగు గ్రామం జన్నారం మండలం మురిమడుగు గ్రామంలో దళితుల ఇండ్లలో జొరబడి జెసిబి తో గుంతలు తవ్విన అటవీ శాఖ అధికారులు.
జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం అక్టోబర్ 14:
జన్నారం మండలంలోని మురుమడుగు గ్రామంలో దళితులు నిర్మించుకున్న ఇండ్లలో జొరబడి గteర్లు దవ్వడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అటవీశాఖ ప్రభుత్వాలకు సంబంధం లేని శాఖగా మారింది .ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ గారు అటవీ శాఖ ఆగడాలపై అసెంబ్లీలో మాట్లాడినప్పటికిని ఫలితం లేకుండా పోతుంది .పేదలు సాగు చేస్తున్న భూములను ధ్వంసం చేసి జెసిబి లతో గుంతలు దవ్వి సాగుకు ఉపయోగపడకుండా చేయడమే కాకుండా మురిమడుగు గ్రామంలో దళితులు ఇల్లు నిర్మించుకొని బిల్డింగులు కట్టుకొని సిసి రోడ్లు గవర్నమెంట్ ద్వారా పోసుకొని బతుకుతుంటే కన్నెర్ర చేసిన ఇంధనపల్లి అటవీ రేంజ్ ఫారెస్ట్ వాళ్లు వందలాది మంది ఫారెస్ట్ అధికారులను దింపి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి ఊరు బయట నుండే కాకుండా ఇండ్లలో జొరబడి వాళ్ల ప్లాట్లలో ఇంటి ఆవరణలో గుంతలు దవ్వడాన్ని ప్రజలందరూ వ్యతిరేకించాలని ప్రజలు ప్రజాస్వామిక వాదులు ప్రజా వ్యతిరేక చర్యలను ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మురిమడుగు గ్రామాన్ని అదిలాబాదు ఉమ్మడి జిల్లా కవ్వాల్ టైగర్ జోన్ బాధితుల వ్యతిరేక పోరాట వేదిక ఆధ్వర్యంలో మురుమడుగులోని దళితుల ఇండ్లను సందర్శించడం జరిగింది. ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం రోజు రోజుకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. నిన్న పెంబి మండలంలో మేకలు మేపుకునే గిరిజనులను అటవీశాఖ అధికారులు కొట్టడాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం .ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ గారు ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా తన గలాన్నీ వినిపించినప్పటికిని ప్రజలకు నష్టం జరుగుతూనే ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ శాఖ అధికారుల దౌర్జన్యాలను ఆపాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో సిపిఐఎం నిర్మల్ జిల్లా కార్యదర్శి గౌతమ్ కృష్ణ ,మంచిర్యాల జిల్లా కార్యదర్శి బోడంకి చందు ,మంచిర్యాల జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కనికరం అశోక్ నిర్మల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం నూతన్ కుమార్ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బొజ్జ ఆశన్న, జన్నారం మండల కార్యదర్శి కామ్రేడ్ కే లింగన్న, వ్యవసాయ కార్మిక సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ డాకూర్ తిరుపతి ,సిపిఎం పెంబి మండల కార్యదర్శి ఆత్రం బాపూరావు డేనియల్ మురుమడుగు గ్రామాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు.

