మెగా రక్తదాన శిబిరంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలి!వాల్ పోస్టర్ ఆవిష్కరించిన చెన్నూర్ సీఐ బాన్సీలాల్.
చెన్నూర్, అక్టోబర్ 14 (అర్జున్ సమాచారం):
రక్తదానం ప్రాణాలను కాపాడే మహాదానమని, ప్రతి ఒక్కరూ రక్తదానంలో భాగస్వాములు కావాలని చెన్నూర్ పట్టణ సీఐ బాన్సీలాల్ పిలుపునిచ్చారు. లయన్స్ క్లబ్ ఆఫ్ చెన్నూర్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ శుక్రవారం చెన్నూరులోని లయోలా స్కూల్లో నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరానికి సంబంధించిన వాల్ పోస్టర్ను బుధవారం ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఐ బాన్సీలాల్ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులకు రక్తదానం ద్వారా ప్రాణదానం చేయవచ్చన్నారు. యువత రక్తదానంపై అవగాహన పెంపొందించుకొని, స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. చెన్నూర్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల యువత, ప్రజలు ఈ నెల 16న నిర్వహించే మెగా రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రాణదాతలుగా నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మల సాగర్, జోన్ చైర్పర్సన్ జాడి తిరుపతి, బ్లడ్ బ్యాంక్ చైర్పర్సన్ బొల్లంపల్లి నాగరాజు గౌడ్, బ్లడ్ బ్యాంక్ కో-చైర్పర్సన్ పప్పురెడ్డి దీక్షిత్, కోశాధికారి లయన్ సౌడం శ్రీనివాస్, జక్కుల సత్యనారాయణ, నగునూరి మహేష్ గౌడ్, నస్పూరి కార్తీక్, రిత్విక్ తదితరులు పాల్గొన్నారు.

