ePaper
Thursday, October 15, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్హైదరాబాద్ లో దక్షిణ ప్రాంతీయ పోలీస్ సమన్వయ కమిటీ భేటీ ఏర్పాట్లను సమీక్షించిన డీజీపీ

హైదరాబాద్ లో దక్షిణ ప్రాంతీయ పోలీస్ సమన్వయ కమిటీ భేటీ ఏర్పాట్లను సమీక్షించిన డీజీపీ

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
తెలంగాణ డీజీపీ  సి.వి. ఆనంద్, , అక్టోబర్ 23న హైదరాబాద్లో జరగనున్న దక్షిణ ప్రాంతీయ పోలీస్ సమన్వయ కమిటీ (RPCC) సమావేశం ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో ఐదు దక్షిణాది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలు, ఉన్నతాధికారులు పాల్గొని పోలీసు వ్యవస్థ, అంతర్గత భద్రతకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు డిసెంబర్లో తిరుపతిలో జరగనున్న 61వ అఖిల భారత డీజీపీలు/ఐజీపీల సదస్సు ఎజెండా లో చేర్చబడతాయి.
రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంచడం, నిఘా సమాచారాన్ని పంచుకోవడం, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలు, శాంతిభద్రతల సమస్యలను సమర్థంగా ఎదుర్కోవడంపై సారించారు. ఇలాంటి ప్రాంతీయ సమావేశాలు వృత్తిపరమైన ఉత్తమ పద్ధతులను రూపొందించి, పరస్పరం పంచుకోవడంతో పాటు, వేగంగా స్పందించి మరింత సమర్థవంతమైన పోలీసింగ్ వ్యవస్థను నిర్మించేందుకు దోహదపడతాయి అని  డీజీపీ పేర్కొన్నారు.
========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!