హైదరాబాద్, అర్జున్ సమాచారం:
తెలంగాణ రైతులకు చట్టబద్ధమైన భూ హక్కులు కల్పించి, భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో భూభారతి చట్టం అమలు, పట్టాదారు పాస్‌బుక్కుల పంపిణీ, భూముల రీ-సర్వే, పెండింగ్ సమస్యల పరిష్కారంపై చర్చించారు. భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 5,68,858 పాస్‌బుక్కులు జారీ చేశామని, గతంలో ఇచ్చిన వాటితో కలిపి మొత్తం 12,40,366 పాస్‌బుక్కులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. రీ-సర్వేను వేగవంతం చేసి, అర్హులకు భూ హక్కులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
1రైతులకు చట్టబద్ధమైన భూ హక్కులు: మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
RELATED ARTICLES

