ePaper
Tuesday, October 20, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసు.. ముగ్గురు అరెస్టు జైపూర్

టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసు.. ముగ్గురు అరెస్టు జైపూర్

📰 Generate e-Paper Clip

జైపూర్,అర్జున్ సమాచారం:
న‌టుడు టైగ‌ర్ ష్రాఫ్ పై  కాల్పులు జ‌రిపిన ముగ్గురిని పోలీసులు  రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్‌లో  అరెస్టు చేసారు.
నిందితుల్లో ఇద్దరు హర్యానాకు, మరొకరు బీహార్‌కు చెందినట్లుగా గుర్తించారు.  ఈ నిందితులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.  ష్రాఫ్‌పై కాల్పులు జరిపింది.. ప్రొఫెషనల్ షూటర్లేనని మీడియాకు  అధికారులు తెలిపారు. కాల్పులకు ముందు నటుడి కదిలికలను రెక్కీ చేసి.. దాడి నిర్వహించినట్లు సమాచారం.  టైగర్ ప్రతి ఆదివారం జుహు ఫుట్‌బాల్ గ్రౌండ్‌కి వెళ్తాడని తెలుసుకున్న దుండగులు, అక్కడి నుంచి కారులో తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో కాల్పులు జరిసారు. తర్వాత అంధేరి వెస్ట్ రైల్వే స్టేషన్ వద్ద బైక్ వదిలి.. బోరివలి వైపు వెళ్లే ట్రైన్ ఎక్కారు. ఆపై మహారాష్ట్ర సరిహద్దు దాటి,  గుజరాత్‌లోకి ప్రవేశించినట్లు గుర్తించారు.
అక్కడి నుంచి రాజస్థాన్‌లోని కోటాకు రైలులో వెళ్లగా, పోలీసులు స్టేషన్‌లో పట్టుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!