అర్జున్ సమాచారం:
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష్?మ బ్యారేజ్ 21 అక్టోబర్ 2023 లో రవికాంత్ ఫిర్యాదు చేసి 3 ఏళ్లు
ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేవు.
గాఢ నిద్రలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తీవ్ర బాధలు పడుతున్నారు.
పత్తి రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
సి ఎం పట్టించుకోకుండా ఎల్ నినో ప్రభావం వల్ల నీరు ఇవ్వలేం అంటున్నారు.
యాసంగి అసలు పంటలు వేయకండి అంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు.
తాగడానికి కూడా నీరు లేవని బెదిరిస్తున్నారు.
కానీ వాస్తవాలు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ బాగుంటే ఈ కరువు వచ్చేది కాదు.
కంట్రోల్డ్ ఎక్స్ ప్లోజన్ తో డిటోనేటర్లు పెట్టి పేల్చి ఉంటారని అనుమానమని అన్నారు.
మేడిగడ్డ లక్ష్మి బారేజ్ లో 8 బ్లాక్ లు ఉండగా… 7 వ బ్లాక్ పిల్లర్ 20 కుంగిపోయింది
అక్టోబర్ 21,2023 లో సాయంత్రం రవికాంత్ ఇంజనీర్ ఫిర్యాదు తో 174/2023 ఐపిసి 357 ప్రకారం కేసు నమోదు అయింది.
కేసు నమోదైన వెంటనే నేర స్థలాన్ని సీజ్ చేసి క్రాక్స్ వచ్చిన పిల్లర్ దగ్గర సాంపుల్స్ సేకరించి, వీడియో రికార్డ్ చేసి, సెల్ ఫోన్ టవర్స్ లొకేషన్స్ తీసుకొని కాల్ డేటా తీసుకొని విశ్లేషించాల్సిన పరిస్థితి ఉండాలి.
జియాలజీ డిపార్ట్ మెంట్ ద్వారా సీస్మిక్ డాటా సేకరించాల్సింది. భూకంపం ఏమైనా వచ్చిందా,రిక్టర్ స్కేల్ మీద రీడింగ్ ఎంత నమోదైంది అనేది తెలుసుకొని ఉండాలి.
ఎందుకంటే డిటొనేటర్లు తో పేలుళ్లు జరిగినపుడు భూకంపం వచ్చినట్టుగా శబ్దం వస్తుంది.
2025 లోనే ఈ కేసును అన్ డిటెక్టివ్ గా మూసేశారు.
ఎవిడెన్స్ లేదని, తప్పుడు సమాచారం అని, అన్ డిటెక్టివ్ అని పోలీసిబి కేసు క్లోజ్ చేయవచ్చు.
అన్ డిటెక్టివ్ అంటే పోలీసులకు కూడా ఈ కేసులో అనుమానం ఉంది.
కాంట్రాక్టర్లు, సిడబ్యుసి రిపోర్ట్ తీసుకున్నారా లేదా?
అప్పటికీ కాళేశ్వరం వ్యతిరేకంగా మాట్లాడే కాంగ్రెస్ బిజెపి నేతలు, వారి పోల్ స్ట్రాటజిస్టుల కాల్ డాటా సేకరించారా?
హోం మంత్రి రేవంత్ రెడ్డే, ఆయన దగ్గరనే లక్ష మంది పోలీసులు ఉన్నారు. సిఐడి, ఎస్.బి, ఐంటలిజెన్స్,కౌంటర్ ఇంటలిజెన్స్ అందరూ ఆయన చేతిలోనే ఉన్నారు.
అయినా కేసులు అర్ధాంతరంగా మూసేశారు.
ఇది క్లోజ్ చేసే కేసు కాదు. అత్యంత అధునాతన టెక్నాలజీ ఉపయోగించి విచారణ జరపాల్సిన కేసు. ఎలా క్లోజ్ చేశారు.
జెనీవా ఒప్పందం ప్రకారం ఏ డ్యాం కూల్చేసినా అది యుద్ధ నేరం అని ప్రపంచ దేశాలు అంగీకరించాయి.
అలాంటి యుద్ధనేరం తెలంగాణలో జరిగింది. అలాంటి కేసును ఎలా క్లోజ్ చేస్తారు.
2025 తనుగుల హుజూరాబాద్ మానేరు నది మీద 35 కోట్లతో కట్టిన చెక్ డ్యాం ను దుండగులు పేల్చేశారు.
ఆ కేసు కూడా విచారణ చేయకుండా ఆపేశారు. ఇదేంటని అడిగితే ఎక్స్ పర్ట్ ఒపీనియన్ కి పంపామని చెబుతున్నారు.
హుస్సేమియా వాగు మీద మరోసారి పేల్చాలని పోతుంటే పోలీసులే కాంగ్రెస్ నాయకులను ఆపారు.
25 లక్షల క్యూసెక్కుల వరదను ఆపగలిగిన లక్ష్మి బ్యారేజీ.
కూలిపోయే నాటికి వరద ప్రవాహం 22 లక్షల క్యూసెక్కులు మాత్రమే ఉంది అలాంపుడు ఎలా కుంగిపోతుంది.
కిషన్ రెడ్డి అక్టోబర్ 3 2023న తియస్థా నది మీద కట్టిన డ్యాం ధ్వంసమైతే 70 మంది చనిపోయారు కానీ ఆయన,దీనిపై ఎన్.డి.ఎస్.ఎ కు లేఖ రాయలేదు.
కానీ కేవలం మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగిపోయిందని ఎన్ డి ఎస్ ఏ కు కిషన్ రెడ్డి లేఖ రాసారు.
కిషన్ రెడ్డి, బండి సంజయ్, రేవంత్ ఫోన్ కాల్ డాటా మరియు వారి పోల్ స్ట్రాటజిస్టులు,వారితో సంబంధాలు కలిగి ఉన్న మాజీలను గుర్తించి వారి కాల్ డేటా సేకరించి విచారణ చేయాలి.
కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయకపోవడం వల్ల ఆంధ్రకు లాభం.
క్రాప్ హామీ డే అంటూ సి ఎం మాట్లాడడం దారుణం. సాగు నీరు లేకపోవడానికి కారణం రేవంత్ రెడ్డే.
ఇప్పటికే 734 టి ఎం సిల నీరు సముద్రం లో
అందులో 400 టి ఎంసి ల నీరు గత ఆగస్టు నెలలోనే కలిసాయి.
కేసిఆర్ మీద కోపంతో మాత్రమే కన్నెపల్లి నీరు ఎత్తిపోయలేదు.
కేటిఆర్ ,హరీష్ రావు పోరాటంతో కొంత కాలం ఎత్తిపోసి మళ్లీ ఆపేశారు.
సీనియర్ రైటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్న ప్రకారం, ఇప్పటికీ 1 లక్ష 15 వేల క్యూసెక్కుల నీరు గోదావరి నదిలో పారుతుంది.
కేవలం 25,30 కోట్లతో మేడిగడ్డ వద్ద ఇప్పటికైనా కాఫర్ డ్యాం కడితే రోజు 1.4 టి ఎంసి నీరు ఎత్తుకోవచ్చు.
కాఫర్ డ్యాం నిర్మాణానికి కేవలం 50 రోజులు పట్టేది.
నీరు ఆంధ్రకు పంపడానికే కాఫర్ డ్యాం కట్టలేదని అన్నారు.
========================

