హైదరాబాద్, నవంబర్ 05:అర్జున్ సమాచారం:
ఖానామెట్‌లోని అయ్యప్ప సొసైటీలో సర్వే చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అందుకోసం రేవంత్ ప్రభుత్వానికి నెల రోజులు సమయం ఇస్తున్నామన్నారు. అయ్యప్ప సొసైటీలో ఇల్లు కొని ఎవరూ నష్టపోవద్దని ప్రజలకు సూచించారు. ఈ అయ్యప్ప సొసైటీలో రిజిస్ట్రేషన్లు ఉండవని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ సొసైటీలో 750 అక్రమ నిర్మాణాలు జరిగాయని వివరించారు.
గురువారం హైదరాబాద్‌లో కల్వకుంట్ల కవిత విలేకర్లతో మాట్లాడుతూ.. అయ్యప్ప సొసైటీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సొసైటీలోనే నారాయణ, చైతన్య విద్యా సంస్థలు ఉన్నాయని గుర్తు చేశారు. సర్వే నెంబర్ 11/18 నుంచి 11/44 వరకు అక్రమ నిర్మాణాలు జరిగాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు దగ్గరుండి పర్మిషన్లు ఇప్పించి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ భూములు, టీడీఆర్ అక్రమ దందాలు తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమి కనిపించటం లేదని వ్యంగ్యంగా అన్నారు. ఈ దందా ఆపించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్పష్టం చేశారు. గురుకుల ట్రస్ట్ భూములపై అనేక ఉద్యమాలు చేశామని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చి.. రాజకీయాలు తప్ప ఏం మాట్లాడలేదని అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా చేస్తే.. అమిత్ షా హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించారని వివరించారు. బీఆర్ఎస్ పార్టీపై మాట్లాడటం పని కొచ్చే అంశం కాదని టీఆర్ఎస్ చీఫ్ కవిత అభిప్రాయపడ్డారు.
====================== మాదాపూర్ అయ్యప్ప సోసైటీలో సీఎం, ఆయన కుటుంబ సభ్యుల అక్రమ దందాలు
నెల రోజుల్లో అయ్యప్ప సోసైటీలోని అక్రమ భవనాలపై చర్యలు తీసుకోవాలి.
టీఆర్ఎస్అ ధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.
హైదరాబాద్
మాదాపూర్ అయ్యప్ప సోసైటీలో సీఎం, ఆయన కుటుంబ సభ్యులు అక్రమ దందాలు నడిపించారు. హైకోర్టు ఆర్డర్ ను లెక్కచేయకుండా అక్రమ పర్మిషన్లు ఇప్పిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చాక అక్రమంగా 500-700 వందల అక్రమ భవనాలు నిర్మించారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరోపించారు.
బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కవిత మాట్లాడుతూ ఎక్కువ దోపిడీ చేస్తే ప్రకృతి కూడా క్షమించదు.. శిక్షిస్తుంది . నెల రోజుల్లో అయ్యప్ప సోసైటీలోని అక్రమ భవనాలపై చర్యలు తీసుకోవాలి. లేదంటే మేమే వెళ్లి అక్రమ భవనాలకు రెడ్ మార్క్ వేస్తాం. హైదరాబాద్ నగరాన్ని ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు కామధేనువుగా వాడుకుంటూ అక్రమ సంపాదన పెంచుకుంటున్నారు. నగరంలో రోడ్లు, బస్తీ దవాఖాలు, మంచినీళ్లు సరిగా లేని పరిస్థితి పక్కన పెట్టి అక్రమ సంపాదనపైనే సీఎం దృష్టి పెట్టారు . నగరంలో ఎటు చూసినా భూములు, పర్మిషన్లు, టీడీఆర్ పేరుతో అక్రమ దందాలే కనిపిస్తున్నాయని అన్నారు.
ముఖ్యంగా అయ్యప్ప సోసైటీలో విచ్చలవిడిగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడుతున్నారు. భూదాన్ ఉద్యమం స్ఫూర్తితో తెలంగాణ విద్యార్థులకు మంచి చదువు చెప్పించాలని అయ్యప్ప సోసైటీలో 150 ఎకరాలతో గురుకుల ట్రస్ట్ బోర్డు ఏర్పాటైంది. భూముల విషయంలో ట్రస్ట్ ఛైర్మన్ విఠల్ రావు వాటిని కాపాడేందుకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు.
కానీ ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున అక్రమ భవనాలను నిర్మిస్తున్నారు. గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయ్యప్ప సోసైటీలోని ఖానామెట్ లో 5 వందల నుంచి 7 వందల అక్రమ భవనాలు వచ్చాయి. ఇప్పుడు కూడా దాదాపు 80 భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. కేవలం నోటరీ ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తూ…10 ఫ్లోర్ల వరకు పర్మిషన్లు ఇస్తున్నారు. రెండు భవనాల మధ్య కనీసం అగర్ బత్తి పట్టేంత స్థలం కూడా లేదు. అక్కడ పెద్ద కాలేజ్ లు, పీజీ హాస్టల్స్ నిర్వహిస్తున్నారు. ప్రతి భవనంలో సెల్లార్ కిచెన్ ఉందని అన్నారు.
అక్కడ ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే పెద్ద ఎత్తున నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. అయిన సరే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నట్లు? ఎందుకు తనిఖీలు చేయటం లేదు? మీ మీద ఎవరి ఒత్తిడి ఉందో చెప్పండి. ఎవరు మిమ్మల్ని ఆపుతున్నారు. సర్వే నంబర్ 11/ 18 నుంచి 44 వరకు వరుసగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. సర్వే నంబర్ 12 లో 12 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు? ఈ విషయాలపై ఏ రాజకీయ పార్టీ ఎందుకు మాట్లాడటం లేదు ? ముఖ్యమంత్రి ఇంటికి దగ్గర్లో ఉన్న ఖానామెట్ లో అక్రమ బిల్డింగ్ నిర్మిస్తుంటే ఎందుకు ఆపటం లేదు. న్యూస్ పేపర్ అక్కడ ఉన్న అక్రమ భవనాలను గూగుల్ మ్యాప్ తో సహా ట్యాగ్ చేసి న్యూస్ రాసింది. దాన్ని నేను ట్యాగ్ చేసిన తర్వాత ఎంతో మంది మీడియా వాళ్లు ఆ న్యూస్ కవర్ చేసేందుకు వెళ్లారు. కానీ అక్కడ ఉన్న ఓనర్లు మీడియా వాళ్లను బెదిరిస్తూ భయపెడుతున్నారని అన్నారు.
ఈ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ లేనందున ఒక్క ఇటుక కూడా పేర్చవద్దని హైకోర్టు ఆర్డర్ ఉంది. హైకోర్టు ఆర్డర్ ను కాదని ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి సోదరులే దగ్గరుండి పర్మిషన్లు ఇప్పిస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారని ఆమె ఆరోపించారు.
=======================

