ePaper
Saturday, November 7, 2026
ePaper
Homeతెలంగాణన్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలి.... రక్షణ కల్పించాలి.

న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలి…. రక్షణ కల్పించాలి.

📰 Generate e-Paper Clip

న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలి…. రక్షణ కల్పించాలి.

ఆల్ ఇండియా ,లాయర్స్ యూనియన్ చెన్నూరు కోర్టు కమిటీ ఎన్నిక.. అధ్యక్షుడిగా పున్నం, ప్రధాన కార్యదర్శిగా బోర్లకుంట రాజేష్.

అర్జున్ సమాచారం నవంబర్ 6 . బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి.

మంచిర్యాల జిల్లా చెన్నూరు: న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలని, న్యాయవాదులకు తగిన రక్షణ కల్పించాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కొయ్యల ఏమాజి ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. న్యాయవాదుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చెన్నూరు బార్ అసోసియేషన్‌లో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ చెన్నూరు కోర్టు నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా న్యాయవాది పున్నం, ప్రధాన కార్యదర్శిగా బోర్లకుంట రాజేష్ ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షుడిగా ఎం.డి. నవాజ్, కార్యదర్శిగా తగరం రాజశేఖర్, కోశాధికారిగా సేగ్యం రమేష్ ఎన్నికయ్యారు.
కమిటీ సభ్యులుగా పి. వసంత్, ఎం.డి. జుబేర్, కె. ప్రభాకర్, జి. రమాదేవి ఎన్నికయ్యారు. చెన్నూరు బార్ అసోసియేషన్‌లో నిర్వహించిన ఈ ఎన్నికల ప్రక్రియకు సీనియర్ న్యాయవాది, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యల ఏమాజి, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహేష్ ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా కొయ్యల ఏమాజి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. న్యాయవాదులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ చొరవ చూపాలని కోరారు. న్యాయవాదుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర కమిటీ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు కమల మనోహర్ రావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నికతో చెన్నూరు కోర్టు పరిధిలో న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి మరింత కృషి జరుగుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!