అర్జున్ సమాచారం:
శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం (EVM) గోడౌన్ను నెలవారీ తనిఖీల్లో భాగంగా సంబంధిత అధికారులు సందర్శించి తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా గోడౌన్లో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMలు), వీవీప్యాట్ (VVPAT) యంత్రాల భద్రత, నిల్వ ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు తదితర అంశాలను పరిశీలించారు. గోడౌన్ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అన్ని జాగ్రత్తలు పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ తనిఖీలో ఎన్నికల విభాగం అధికారి గఫర్, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
========================

