ఆర్మీ క్యాంటీన్ కోటా ద్వారా సబ్సిడీ ధరలకు మద్యం కొనుగోలు చేసి, బయట వ్యక్తులకు అక్రమంగా విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. అల్వాల్ పరిధిలో రెండు వేర్వేరు ఇళ్లపై దాడులు చేసి మొత్తం 163 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2.11 లక్షలుగా అంచనా వేశారు.
లోతుకుంట సరస్వతి నగర్‌లో మన్యం నాగప్రసన్న, ఆమె భర్త రామ్ ఆంజనేయులు ఇంటిపై మల్కాజిగిరి ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం దాడి చేసింది. ఈ దాడిలో 96 బాటిళ్లు పట్టుబడ్డాయి. భర్త క్యాంటీన్ ద్వారా మద్యం తెస్తుండగా, భార్య ఇంటి నుంచే విక్రయాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
రెండో ఘటనలో న్యూ బోయిన్‌పల్లిలోని సౌజన్య కాలనీలో స్టేట్ టాస్క్‌ఫోర్స్ టీమ్-బి దాడి చేసి ముసిమి లెంక (39) వద్ద 67 బాటిళ్లను స్వాధీనం చేసుకుంది. అక్రమ విక్రయాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై నాగప్రసన్న, లెంకలను అరెస్ట్ చేసి అల్వాల్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు
====================
ఆర్మీ క్యాంటీన్ మద్యం అక్రమ విక్రయాలు.. అల్వాల్‌లో రెండు చోట్ల దాడులు, 163 బాటిళ్లు స్వాధీనం
RELATED ARTICLES

