ePaper
Tuesday, November 10, 2026
ePaper
Homeసినిమాసుమయా రెడ్డి ప్రొడక్షన్ నెం. 2 మూవీ త్వరలో టైటిల్ అనౌన్స్మెంట్

సుమయా రెడ్డి ప్రొడక్షన్ నెం. 2 మూవీ త్వరలో టైటిల్ అనౌన్స్మెంట్

📰 Generate e-Paper Clip

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’ అంటూ మొదటి సినిమాతోనే నటిగా, నిర్మాతగా, రచయితగా సుమయా రెడ్డి తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇక ఈ రెండో ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రకటన కూడా త్వరలోనే వెలువడనుంది. ఈ సారి కూడా తన సొంత బ్యానర్‌లోనే హీరోయిన్‌గా సుమయా రెడ్డి నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ ప్రొడక్షన్ నెం.2 టైటిల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే ఉండబోతోందని ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్‌లో సుమయా రెడ్డి చేతి నిండా డబ్బు, బంగారంతో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌లో సుమయా రెడ్డిని చూస్తుంటే మహారాణిలా అనిపిస్తున్నారు. కామెడీ, హారర్ జానర్‌లో ఇది వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌తో రాబోతోంది అని ప్రీ లుక్ పోస్టర్‌తో హింట్ ఇచ్చారు. ఈ ఒక్క పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌తో పాటుగా ఇతర వివరాల్ని కూడా ప్రకటించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!