ePaper
Thursday, November 12, 2026
ePaper
Homeఅంతర్జాతీయంవిజయవాడప్రైవేట్ బస్సుల అధిక ఛార్జీలకు కళ్లెం?.. రవాణా శాఖకు హైకోర్టు కీలక ఆదేశం...

ప్రైవేట్ బస్సుల అధిక ఛార్జీలకు కళ్లెం?.. రవాణా శాఖకు హైకోర్టు కీలక ఆదేశం – ఛార్జీల నియంత్రణపై 2 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సూచన – పండుగ వేళల్లో ఇష్టానుసారం ధరలు పెంచుతున్నారని ప్రజాప్రయోజన వ్యాజ్యం – ఫిర్యాదులకు హెల్ప్‌లైన్, వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేయాలని పిటిషనర్ విజ్ఞప్తి

📰 Generate e-Paper Clip

విజయవాడ: అర్జున్ సమాచారం:
పండుగలు, సెలవు దినాల్లో ప్రైవేటు బస్సులు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై రెండు నెలల్లోగా సమగ్రంగా పరిశీలించి, తగిన కారణాలతో ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) ధర్మాసనం పరిష్కరించింది. విజయవాడకు చెందిన చిట్టినేని సాంబశివరావు ఈ పిల్ దాఖలు చేశారు. పండుగలు, వారాంతాల్లో ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని ప్రైవేటు ఆపరేటర్లు ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 67(1) ప్రకారం బస్సుల రకం, ప్రయాణ దూరాన్ని బట్టి గరిష్ఠ ఛార్జీలను ప్రభుత్వం నిర్ణయించాలని పిటిషనర్ కోరారు. అధిక ధరలపై ఫిర్యాదు చేసేందుకు ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్, వాట్సాప్ నంబర్‌ను ఏర్పాటు చేయాలని, బస్సుల అనుమతుల వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని కూడా పిటిషనర్ తన వినతిపత్రంలో పేర్కొన్నారు. గతంలోనూ పండుగ సీజన్లలో నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు బస్సులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా జరిపిన తనిఖీల్లో 937 బస్సులపై కేసులు నమోదు చేసి, రూ. 53.86 లక్షల జరిమానా వసూలు చేశారు. ఇందులో అధిక ఛార్జీల వసూలు కిందే 217 కేసులు నమోదయ్యాయి.
పిటిషనర్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఆయన సమర్పించిన వినతిని పరిశీలించి రెండు నెలల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని రవాణా శాఖ కమిషనర్‌ను ఆదేశించింది.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!