ePaper
Monday, November 16, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్ జేఎన్‌టీయూహెచ్ హాస్టల్‌లో విషాదం....

 జేఎన్‌టీయూహెచ్ హాస్టల్‌లో విషాదం….

📰 Generate e-Paper Clip

 జేఎన్‌టీయూహెచ్ హాస్టల్‌లో విషాదం….

సెమిస్టర్‌లో ఫెయిల్ అయ్యాడన్న మనస్తాపంతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య.

హైదరాబాద్ : అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 16.

కూకట్‌పల్లిలోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూహెచ్) వసతి గృహంలో ఒక ఇంజినీరింగ్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. మృతుడిని 19 ఏళ్ల రాజా విక్రమ్ బాబుగా గుర్తించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఖమ్మం ప్రాంతానికి చెందిన ఉపేంద్ర కుమారుడైన విక్రమ్ బాబు, కూకట్‌పల్లి జేఎన్‌టీయూహెచ్‌లో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తున్నాడు.
విశ్వవిద్యాలయంలోని గౌతమ్ బాయ్స్ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న అతను, సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇదే కారణంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.
అర్ధరాత్రి దాటిన తర్వాత హాస్టల్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ప్రాథమిక వివరాలు సేకరించగా, పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!