ePaper
Friday, November 20, 2026
ePaper
Homeఅంతర్జాతీయంఅంతర్జాతీయంటెక్ వైఫల్యాల ఎఫెక్ట్..సైబర్ డైరెక్టర్‌ను తొలగించిన ట్రంప్.

టెక్ వైఫల్యాల ఎఫెక్ట్..సైబర్ డైరెక్టర్‌ను తొలగించిన ట్రంప్.

📰 Generate e-Paper Clip

టెక్ వైఫల్యాల ఎఫెక్ట్..సైబర్ డైరెక్టర్‌ను తొలగించిన ట్రంప్.

అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 20.

వైట్‌హౌస్ జాతీయ సైబర్ డైరెక్టర్ సీన్ కెయిన్‌క్రాస్ తొలగింపు,వరుస సాంకేతిక వైఫల్యాల కారణంగానే ఈ నిర్ణయంగత వారం విమాన, బ్యాంకింగ్, జాతీయ భద్రతా వ్యవస్థల్లో అంతరాయాలు,

కెయిన్‌క్రాస్ తొలగింపును ధ్రువీకరించిన వైట్‌హౌస్ వర్గాలు తాత్కాలిక డైరెక్టర్‌గా కిర్‌స్టెన్ డేవిస్ నియామకం.

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న తీవ్రమైన సాంకేతిక అంతరాయాల నేపథ్యంలో వైట్‌హౌస్ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ సైబర్ డైరెక్టర్ సీన్ కెయిన్‌క్రాస్‌ను ఆయన పదవి నుంచి తొలగించింది. దేశంలో వరుసగా సైబర్ భద్రతా వైఫల్యాలు తలెత్తిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత వారం రోజులుగా అమెరికాను పలు టెక్నికల్ సమస్యలు అతలాకుతలం చేశాయి. దేశవ్యాప్తంగా విమాన సేవలు గంటల తరబడి నిలిచిపోవడం, మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం కారణంగా ఈ-మెయిల్, బ్యాంకింగ్ వ్యవస్థలు స్తంభించడం తీవ్ర గందరగోళానికి దారితీసింది. చివరకు అత్యంత కీలకమైన జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ) నెట్‌వర్క్‌లో కూడా తాత్కాలికంగా సమస్యలు తలెత్తడం తీవ్ర కలకలం రేపింది. ఈ వరుస వైఫల్యాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
ఈ పరిణామాల నేపథ్యంలోనే కెయిన్‌క్రాస్‌ను పదవి నుంచి తొలగించారని వైట్‌హౌస్‌ ప్ర‌తినిధి ఒక‌రు మీడియాకు వెల్లడించారు. “సీన్ కెయిన్‌క్రాస్‌ను తొలగించడానికి అధ్యక్షుడు పూర్తి మద్దతు ఇచ్చారు” అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో సైబర్ భద్రతా విధానాలు, వ్యూహాలను పర్యవేక్షించడం కెయిన్‌క్రాస్ ప్రధాన బాధ్యత. ఆయన స్థానంలో రక్షణ శాఖ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీఐఓ) కిర్‌స్టెన్ డేవిస్ తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే, తన తొలగింపుపై స్పందించేందుకు కెయిన్‌క్రాస్ నిరాకరించారు. ఒకే వారంలో విమానయానం నుంచి జాతీయ భద్రత వరకు కీలక రంగాల్లో సాంకేతిక వైఫల్యాలు చోటుచేసుకోవడం ట్రంప్ యంత్రాంగంపై తీవ్ర ఒత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలో సైబర్ భద్రత విషయంలో ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించనుందో కెయిన్‌క్రాస్ తొలగింపు స్పష్టమైన సంకేతమిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!